breaking news
Makutam Movie
-
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి ఎపిక్, మారెమ్మ, మహేంద్ర గిరి వారాహి, మండాడి, సర్దార్ 2 సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో దేనికి కూడా సూపర్ హిట్ అనే టాక్ రాలేదు. వీటిని చూసిన చాలామంది ఓకే పర్లేదని అంటున్నారు. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో పలు తెలుగు హిట్ సినిమాలతో పాటు డబ్బింగ్‌లు కూడా ఉన్నాయి.ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్', విశాల్ 'మకుటం', మహారాజా హాస్టల్, పంచనామా, కట్టాలన్, వరవు లాంటి చిత్రాలు, సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (సెప్టెంబరు 11)అమెజాన్ ప్రైమ్మకుటం -తెలుగు డబ్బింగ్ సినిమామహారాజ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీమ్యాజిక్ మష్రూమ్స్ - మలయాళ చిత్రంఅచ్యుత అవతారం - మలయాళ సినిమాడియోల్ బాంద్ 2 - మరాఠీ చిత్రంసల్మోఖ్జీ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సినిమారక్కసపురదోళ్ - కన్నడ మూవీద రివల్యూషనరీస్ - తెలుగు డబ్బింగ్ సిరీస్నెట్ఫ్లిక్స్విశ్వనాథ్ అండ్ సన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాగో టీమ్ - స్పానిష్ మూవీచుంబక్ - హిందీ సిరీస్కాల్ మై ఏజెంట్! ద మూవీ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్ద పేపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్అలీబాబా ఔర్ 40 భూత్ - హిందీ సిరీస్ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్వన్ నైట్ వోయెజ్ - జపనీస్ సిరీస్లిబాంగ్ లిబు - మలేషియన్ మూవీజంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ - హిందీ సిరీస్ (సెప్టెంబరు 12)జీ5పంచనామా - తెలుగు సిరీస్ఘమసాన్ - హిందీ సిరీస్అద్కిట్టా - మరాఠీ మూవీఆహాకట్టాలన్ - తెలుగు డబ్బింగ్ సినిమావరవు - తెలుగు డబ్బింగ్ మూవీవెంజన్స్ - తమిళ చిత్రంసన్ నెక్స్ట్వివాహ్ - మలయాళ సినిమాలయన్స్ గేట్ ప్లేహంగ్రీ - తెలుగు డబ్బింగ్ మూవీ -
విశాల్ సినిమాకు దారుణ పరిస్థితి.. రూ.కోటి కూడా రాలేదు!
తమిళ హీరో విశాల్ ఏ సినిమా చేసినా సరే దాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటాడు. అలా నిన్న(ఆగస్టు 14) థియేటర్లలో రిలీజైన మూవీ 'మకుటం'. ఇన్నేళ్ల కెరీర్లో తొలిసారి దీనితోనే దర్శకుడిగా మారాడు. అలానే తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తీరా చూస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పరిస్థితి ఘోరాతిఘోరంగా తయారైంది.(ఇదీ చదవండి: విశ్వనాథ్ అండ్ సన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?)విశాల్ 'మకుటం'(తమిళంల మగుడం) సినిమాకు తొలిరోజు తమిళనాడులో కేవలం రూ.38 లక్షలు రాగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.20 లక్షలు, కర్ణాటకలో రూ.7 లక్షలు, కేరళలో రూ.2 లక్షలు, దేశంలో మిగతా చోట్ల కలిపి రూ.లక్ష మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.68 లక్షల గ్రాస్ మాత్రమే వసూలైనట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో రూ.20 లక్షల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.ఓవరాల్‌గా రూ.90 లక్షల వరకు వసూళ్లు సాధించిన ఈ సినిమాకు పేలవమైన ఆరంభం దక్కింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఏమైనా ప్లస్ అవుతుందా అనుకుంటే రెండో రోజు బుకింగ్స్ కూడా దారుణంగా ఉన్నాయి. చూస్తుంటే విశాల్‌కి దర్శకుడిగా ఆరంభమే భారీ డిజాస్టర్ దక్కేలా కనిపిస్తోంది. మూడేళ్ల క్రితం 'మార్క్ ఆంటోని'తో రూ.100 కోట్ల మార్క్ అందుకున్న విశాల్ పరిస్థితి ఇప్పుడిలా తయారవడం చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.'మకుటం' విషయానికొస్తే.. కృపాకరం (విశాల్) చెన్నైలో మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య జమున (దుషారా విజయన్) ఇద్దరు పిల్లలతో హ్యాపీగా బతికేస్తుంటాడు. స్థోమత లేకపోవడంతో ఓసారి సెకండ్ హ్యాండ్ కారు కొని తన కుటుంబాన్ని తీసుకుని విహారయాత్రకు వెళ్తాడు. కొందరు దుండగులు కృపాకరం కారుపై కాల్పులు జరుపుతారు. ఈ ఘటనలో ఇతడి భార్య, బిడ్డ చనిపోతారు. ప్రాణాలతో మిగిలిన కొడుకుని పట్టుకుని పారిపోతాడు. ఈ విషయం తన తండ్రి, విశాఖపట్నం అక్కడి పోర్టుని శాసించే లింగ (విశాల్)కు తెలుస్తుంది.బాధలో ఉన్న కొడుకుని చూడటానికి లింగ రాగానే కృపాకరం కోపంతో ఊగిపోతాడు. తన భార్య, బిడ్డల చావుకు లింగానే కారణమని ఆరోపిస్తాడు. అసలు తండ్రీ కొడుకులైన లింగ, కృపాకరం ఎందుకు విడివిడిగా ఉంటున్నారు? కృపాకరం కుటుంబంపై దాడి చేసిందెవరు? వాళ్లకీ లింగాకూ ఉన్న సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ) -
ఫస్ట్ టైమ్ ఈ మూవీలో ఫైట్స్ చేశాను
అంజలి తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది పరందు పో చిత్రంలో మెరిసింది. ఈమె నటిస్తున్న తమిళ మూవీస్ వరసగా రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. విశాల్‌కు జంటగా నటించిన మకుటం.. ఈ శుక్రవారం తెలుగు, తమిళంలో విడుదల కానుంది. 'ఏళు కడల్ ఏళు మలై' త్వరలో విడుదల కానుంది. వీటితో పాటు ఈగై అనే మరో తమిళ చిత్రం, ఒరు పెరుంగలియాట్టం అనే మలయాళ సినిమా ఈమె చేతిలో ఉన్నాయి.(ఇదీ చదవండి: ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు: జ్యోతిక)కాగా ఇటీవల చైన్నెలో జరిగిన 'మకుటం' మీడియా సమావేశంలో పాల్గొన్న అంజలి.. తన మిత్రుడు విశాల్ దర్శకుడిగా తొలి హిట్ అందుకోవాలని విషెస్ చెప్పింది. తమిళ కెరీర్లో తొలిసారి ఇందులోనే ఫైట్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ఇదే మూవీలో అంజలి, విశాల్ చేసిన నచ్చావు మచ్చాన్ అనే పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కాగా వరుసగా విడుదలవుతున్న తన చిత్రాలతో ఈ బ్యూటీ మరోసారి తన సత్తాని చాటుకోబోతుంది.(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్‌ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు) -
ఆమె బదులు మరెవరున్నా తల పీక్కుని పారిపోయేవాళ్లు
తమిళ హీరో విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'మకుటం'. హీరో కూడా ఇతడే. అంజలి, దుషారా విజయన్ హీరోయిన్లు. ఆర్బీ చౌదరి నిర్మించిన 99వ చిత్రమిది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందించాడు. ఈ శుక్రవారం(ఆగస్టు 14) తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో విశాల్ త్రిపాత్రాభినయం చేశాడు. తాజాగా చైన్నెలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ)దర్శకుడుగా నాకు అవకాశమిచ్చిన నిర్మాత ఆర్బీ చౌదరికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన పరిచయం చేసిన 45వ దర్శకుడిని నేను. ఆమధ్య 14 నెలలుగా ఖాళీగా ఉన్నప్పుడు నా కష్టకాలంలో అండగా నిలిచి ప్రోత్సహించిన నా కాబోయే భార్య సాయి ధన్సికకు ధన్యవాదాలు. ఆమె స్థానంలో ఎవరైనా ఉంటే తల పీక్కుని పారిపోయేవారు. నా గురువు అర్జున్‌కి కృతజ్ఞతలు. నన్ను నటించమని ప్రోత్సహించింది ఆయనే. రాంగోపాల్ వర్మ తీసిన 'శివ' చూసిన తర్వాత దర్శకుడిని అవ్వాలనే కోరిక కలిగింది. అది 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు నెరవేరింది. నా తల్లిదండ్రులకు ఎప్పుడు రుణపడి ఉంటాను. వారి ప్రోత్సాహమే నన్ను స్థాయికి చేర్చింది అని విశాల్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?: నాగవంశీ) -
విశాల్ మకుటం.. తెలుగు ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ హీరో విశాల్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం మకుటం. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దుషార విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే మకుటం తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విశాల్ మూడు గెటప్ల్లో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే యాక్షన్‌తో పాటు కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తెలుగు ట్రైలర్ చూసేయండి. -
విశాల్ ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్
విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మాణంలో రాబోతోన్న ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న ఈ తరుణంలో మేకర్లు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించడమే కాకుండా.. ఆగస్ట్ 7న ట్రైలర్‌ను విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు.ఇప్పటికే విశాల్ ‘మకుటం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటం.. పైగా దర్శకుడిగా మొదటి సినిమా అవ్వడం, జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించడంతో ప్రమోషన్స్‌లో మరింత స్పీడ్ పెంచేలా కనిపిస్తున్నారు. -
వేధిస్తుంటే రాఖీ కట్టా.. నాకే షాకిచ్చాడు : అంజలి
హీరోయిన్ అంజలి ఇప్పుడు తమిళ చిత్రం ‘మగుడం’(తెలుగులో మకుటం) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి.. తన చిన్నప్పుడు జరిగిన ఓ లవ్ ప్రపోజల్ గురించి చెప్పింది. పదే పదే వేధిస్తున్నాడని రాఖీ కడితే.. అతనే తనకు షాకిచ్చాడని అంజలి చెప్పుకొచ్చింది.సవాల్ చేశాడు.. స్కూల్ డేస్‌లో నా క్లాస్మేట్ ఒకతను ప్రేమ పేరుతో నా వెంబడి పడేవాడు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అతను లవ్ ప్రపోజల్ చేస్తూనే ఉన్నాడు కానీ నేను పట్టించుకునేదానిని కాదు. ఒకసారి ‘నువ్వు నాకు రాఖీ కట్టి చూడు’ అంటూ అతడు నాకు సవాల్ విసిరాడు. అతని అహంకారపు మాటలు నాకు నచ్చలేదు. వెంటనే రాఖీ తీసుకొచ్చి కట్టేశా. ఇక ఆ అబ్బాయి నా వెంటపడడని భావించా. కానీ, అతను నాకు షాకిచ్చాడు. వెంటనే రాఖీ తీసేసి ‘నేను నీకు బ్రదర్‌ని కాలేను.. నేను కన్నన్‌ని’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను నాకు మళ్లీ కనిపించలేదు’ అని అంజలి చెప్పుకొచ్చింది.ఒకరిపేరు చెబితే..మరొకరి పేరుఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన ప్రేమ, పెళ్లి గురించి అనేక రూమర్స్ వచ్చాయని..ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశానని అంజలి చెప్పారు. ‘పలువురు హీరోలతో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అవి చూసి అప్పట్లో చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నా. ‘నేను ఒకరి పేరు చెబితే, మీరు ఇంకొకరి గురించి అడుగుతారు. అందుకే నేను ఎవరి పేరూ చెప్పదలుచుకోలేదు. ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరు’ అని అంజలి చెప్పుకొచ్చింది. -
నా చేయి పట్టుకో...
విశాల్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘మకుటం’. దివంగత నిర్మాత ఆర్బీ చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలోని 99వ చిత్రం ఇది. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటించారు. ‘మకుటం’ సినిమా జూలైలో విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలోని ‘నచ్చాకే వచ్చారా..’ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది.‘నచ్చాకే వచ్చారా... వెచ్చంగా హత్తుకో గుండెల్లో పెట్టుకో..., నా చేయి పట్టుకో...’ అంటూ ‘నచ్చారే...’ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ స్వరకల్పనలో భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ పాటను ప్రభ పాడారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘శివ’ సినిమా చూసిన తర్వాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. ‘మకుటం’ చిత్రంతో నా ఆకాంక్ష నెరవేరింది. ఆర్బీ చౌదరిగారిని మిస్ అవుతున్నాను.ఆ నిర్మాణ సంస్థ నుంచి దర్శకుడిగా నేను 45వ వ్యక్తిని. సుబ్రహ్మణ్యంగారు నాపై పెట్టుకున్న నమ్మకంతోనే ‘మకుటం’ సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది. మా నాన్న జీకే రెడ్డి గారి వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను. ‘పందెం కోడి’ మూవీని ఆయనే పట్టుబట్టి తెలుగులో రిలీజ్ చేశారు. ‘మకుటం’ చిత్రంతో ప్రేక్షకులు మంచి అనుభూతి పొందుతారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేశాను’’ అన్నారు అంజలి. ‘‘వందో ప్రాజెక్ట్ అనేది మా నాన్నకి (ఆర్బీ చౌదరి) ఎంతో స్పెషల్. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ, సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు జిత్తన్ రమేష్. -
హైదరాబాద్ ఈవెంట్లో మెరిసిన హీరోయిన్ అంజలి (ఫొటోలు)
-
విశాల్ ‘మకుటం’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విశాల్ త్రిపాత్రాభినయం.. మకుటం యాక్షన్ టీజర్ రిలీజ్
విశాల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ మకుటం. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు రవి అరసు కథ అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టీజర్లో మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ కనిపించడం హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఈ చిత్రంలో అంజలిని మాస్ యాక్షన్‌ను చూడబోతున్నారు. ఆమె సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. విశాల్ విశాల్ త్రిపాత్రాభినయంతో మూడు డిఫరెంట్ గెటప్స్‌లో అదరగొట్టనున్నారు. ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అంచనాలు పెంచుతున్నాయి. . ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై కీలక పాత్రల్లో నటించారు. -
విశాల్‌పై అంజలి సెటైర్లు.. కాన్సెప్ట్ వీడియో
విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. విశాల్, అంజలి కాంబోకి ఉన్న హిట్స్, క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఈ ‘మకుటం’ చిత్రంలోనూ విశాల్ సరసన అంజలి నటించనున్నారు. ఈ మేరకు అంజలి, విశాల్ కలిసి ఓ కాన్సెప్ట్ వీడియోని చేశారు.హీరోయిన్ అంజలి వద్దకు దర్శకుడైన విశాల్ కథ చెప్పడానికి వెళ్తాడు. ఇక కథ చెప్పండి డైరెక్టర్ గారు అని అంజలి అంటారు. ఒక అందమైన గ్రామం అని విశాల్ అంటే.. అది ప్రొడక్షన్ వాళ్లు చూసుకుంటారు కదా.. ముందు మీరు కథ చెప్పండని కౌంటర్ వేస్తారు అంజలి. ఇలా విశాల్ కథ చెబుతూ ఉంటే మధ్య మధ్యలో అంజలి సెటైర్లు వేస్తుంటారు. విశాల్ ఇలా ఏదేదో చెబుతుంటారు.. అసలు మీ వద్ద కథ ఉందా? అని అంజలి అడగడంతో విశాల్ పారిపోతారు. మంచి కథ అని మేనేజర్ చెప్పారే.. విశాల్ ఏంటి ఇలా చెబుతున్నారని అంజలి అనుకుంటారు. కథ అడుగుతోందే.. ఎలా.. రేపు వచ్చి మరో కథ చెబుదాం అని విశాల్ వెళ్లిపోతారు.ఈ కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని విశాల్ చూసుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.. @VishalKOfficial & @yoursanjali chemistry is the major highlight Of the film. #Makutam #MAGUDAM pic.twitter.com/vyj65qzJng— Filmy Today (@Filmy_Today) April 26, 2026 -
క్లైమాక్స్ కంప్లీట్
‘మకుటం’ సినిమా క్లైమాక్స్ కంప్లీటైంది. విశాల్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మకుటం’. దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని క్లైమాక్స్ పోర్షన్‌ను పూర్తి చేశామని విశాల్ పేర్కొన్నారు. ‘‘దాదాపు 800 మంది టెక్నీషియన్లతో 17 రోజులు నిర్విరామంగా ఎంతో కష్టపడి క్లైమాక్స్‌ను పూర్తి చేశాం.దిలీప్ సుబ్బరాయన్ వంటి స్టంట్ కొరియోగ్రాఫర్‌తో పాటు వందలమంది స్టంట్ ఆర్టిస్టులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం. ఈ సీక్వెన్స్ కోసం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చిత్రీకరణ జరిపాం. త్వరలోనే మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక విశాల్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘మకుటం’ అనే సంగతి తెలిసిందే. రవి అరసు ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. -
విశాల్ మరో ప్రయోగం.. యంగ్, మిడిల్ ఏజ్..ఓల్డేజ్ లుక్!
వైవిధ్యమైన కథలు, పాత్రలతో ఆకట్టుకుంటున్న వెర్సటైల్ హీరో విశాల్.. తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధం అయ్యాడు. తన తాజా చిత్రం ‘మకుటం’లో మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించి అలరించబోతున్నాడు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చూస్తుంటే ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథ అని అర్థం అవుతోంది.ఇక ఈ మూవీలో విశాల్ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు.‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.


