విశాల్‌ మరో ప్రయోగం.. యంగ్‌, మిడిల్‌ ఏజ్‌..ఓల్డేజ్‌ లుక్‌! | Vishal’s 35th Film Makutam: Actor Stuns in Three Different Looks in Mafia Backdrop Story | Sakshi
Sakshi News home page

విశాల్‌ మరో ప్రయోగం.. యంగ్‌, మిడిల్‌ ఏజ్‌..ఓల్డేజ్‌ లుక్‌!

Aug 27 2025 4:06 PM | Updated on Aug 27 2025 4:54 PM

First Look Poster Of Puratchi Thalapathy Vishal Makutam Unveiled

వైవిధ్యమైన కథలు, పాత్రలతో ఆకట్టుకుంటున్న వెర్సటైల్ హీరో విశాల్.. తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధం అయ్యాడు.  తన తాజా చిత్రం ‘మకుటం’లో మూడు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించి అలరించబోతున్నాడు.  విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. 

తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చూస్తుంటే ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథ అని అర్థం అవుతోంది.ఇక ఈ మూవీలో విశాల్‌ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు.

‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement