‘మకుటం’ సినిమా క్లైమాక్స్ కంప్లీటైంది. విశాల్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మకుటం’. దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్‌బీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని క్లైమాక్స్ పోర్షన్‌ను పూర్తి చేశామని విశాల్ పేర్కొన్నారు. ‘‘దాదాపు 800 మంది టెక్నీషియన్లతో 17 రోజులు నిర్విరామంగా ఎంతో కష్టపడి క్లైమాక్స్‌ను పూర్తి చేశాం.
దిలీప్ సుబ్బరాయన్ వంటి స్టంట్ కొరియోగ్రాఫర్‌తో పాటు వందలమంది స్టంట్ ఆర్టిస్టులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం. ఈ సీక్వెన్స్ కోసం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చిత్రీకరణ జరిపాం. త్వరలోనే మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక విశాల్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘మకుటం’ అనే సంగతి తెలిసిందే. రవి అరసు ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.


