విశాల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ మకుటం. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు రవి అరసు కథ అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్‌లో మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ కనిపించడం హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఈ చిత్రంలో అంజలిని మాస్ యాక్షన్‌ను చూడబోతున్నారు. ఆమె సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. విశాల్ విశాల్ త్రిపాత్రాభినయంతో మూడు డిఫరెంట్ గెటప్స్‌లో అదరగొట్టనున్నారు. ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అంచనాలు పెంచుతున్నాయి. . ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై కీలక పాత్రల్లో నటించారు.


