ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓం చాప్టర్ 1: రుధిర–ది బ్లడ్ ఉడ్’. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్‌టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 16న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘అరుణాచలేశ్వరుడికి హరోం హర’ అనే డైలాగ్‌తో పాటు, ‘వీర వీర ఓంకార..’ అనే పాట కూడా ఈ టీజర్‌లో ఉంది.
‘‘భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సినిమా ఇది. ‘ఆర్ టెక్ స్టూడియోస్’కు తమిళంలో తొలి సినిమా. ఈ నిర్మాణ సంస్థతో మా జర్నీ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు వండర్‌బార్ ఫిలిమ్స్ ప్రతినిధి శ్రేయస్. ‘‘ప్రేక్షకులందర్నీ అలరించే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు ఆర్ టేక్ స్టూడియోస్ ప్రతినిధులు శ్రద్ధ, అజ్మత్. ‘‘ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రంగా ‘ఓం’ నిలుస్తుంది’’ అని డివో మ్యూజిక్ ప్రతినిధి విషు, వార్నర్ మ్యూజిక్ గ్రూప్–ఇండియా ప్రతినిధి జై మెహతా చె΄్పారు. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్.


