మాస్‌రాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే అడుగుపెట్టింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా భాగ్యశ్రీ, అఖిల్‌తో కలిసి నటించిన లెనిన్ సినిమా ఆమె కెరీర్‌కు మలుపు తిప్పింది.
తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తన కెరీర్‌పై ప్రత్యేకమైన కలలు ఏమీ పెట్టుకోలేదని స్పష్టం చేసింది. నాకు ఎలాంటి డ్రీమ్ రోల్స్ లేవు.. ఫ్లోలో వెళ్లిపోవడమే. టార్గెట్లు లాంటివి పెట్టుకుంటే టెన్షన్ వస్తుంది. చిన్న చిన్న టైమ్ లైన్స్ పెట్టుకొని ముందుకు సాగితే మనసుకు చాలా హాయిగా ఉంటుందని ఆమె చెప్పింది.
తెలుగు ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న భాగ్యశ్రీ, తన చివరి చిత్రం కూడా తెలుగులోనే చేస్తానని ఇప్పటికే తెలిపింది. అలా ఈ గ్యాప్‌లో రాజమౌళి, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తేచాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం భాగ్యశ్రీ తెలుగు నేర్చుకుంటోంది. అంతేకాదు తెలుగు సంస్కృతికి కూడా అలవాటు పడుతోంది. ఉదయం అల్పాహారం నుంచి డిన్నర్ వరకు అన్నింటిలో తెలుగు వంటకాలను ఇష్టపడుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా వంటి వంటకాలు తన ఫేవరెట్ లిస్ట్‌లో ఉన్నాయని వెల్లడించింది.
ఇక తనకు ప్రత్యేకంగా ఏ నగరంలో సెటిల్ అవ్వాలని లేదని, కానీ హిల్ స్టేషన్లు అంటే చాలా ఇష్టమని తెలిపింది. బీచ్‌ల కంటే కొండ ప్రాంతంలో ఉండడమే తనకు హాయిగా అనిపిస్తుందని చెప్పింది. ఇటీవల తన సంపాదనతో తల్లికి మొబైల్ ఫోన్ కొనిచ్చిందని తెలిపింది. తనది మధ్యతరగతి కుటుంబమని.. కానీ తల్లిదండ్రుల కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదని ఆమె భావోద్వేగంగా చెప్పింది.


