'రాయన్'కి జాతీయ అవార్డ్‌.. విమర్శలకు ధనుష్ కౌంటర్ | Dhanush Reacts On Raayan National Award Controversy | Sakshi
Sakshi News home page

Dhanush: కనీసం 10 శాతం మంది నాకు సపోర్ట్ చేయలేదు

Jul 26 2026 7:53 PM | Updated on Jul 26 2026 8:00 PM

Dhanush Reacts On Raayan National Award Controversy

2024కి సంబంధించి కొన్నిరోజుల క్రితం జాతీయ సినీ అవార్డులని ప్రకటించారు. అయితే వీటిపై చాలానే విమర్శలు వచ్చాయి. కొన్ని చిత్రాలకు అసలు ఏ ప్రాతిపదికన ఇచ్చారంటూ సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శించారు. అలా ట్రోల్స్ బారిన పడ్డ మూవీ 'రాయన్'. ఉత్తమ తమిళ సినిమాగా దీనికి పురస్కారం దక్కింది. ఈ విషయమై హీరో ధనుష్‌ని పలువురు విమర్శించారు. ఇప్పుడు వాళ్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఇంట విషాదం)

చెన్నైలో ఆదివారం, ధనుష్ పేరిట బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్.. తన చిత్రానికి జాతీయ అవార్డ్ ప్రకటించడంపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు. అప్పట్లో ఒక్కరూ మాట్లాడలేదు కానీ ఇప్పుడు 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని కౌంటర్ ఇచ్చాడు.

'మైయిళగన్(సత్యం సుందరం), మహారాజా సినిమాలు 'రాయన్' కంటే బాగున్నాయి. ఆ విషయాన్ని నేను కూడా ఒప్పుకొంటాను. కానీ గతంలో నేను నటించిన పుదుపెట్టై, వడచెన్నై, కర్ణన్, మరియన్, రన్‌ఝానా తదితర చిత్రాలు విడుదలైన టైంలో జాతీయ అవార్డులకు అర్హమైనవని బలంగా వాదించిన వాళ్లు చాలా తక్కువమంది. ఇప్పుడు నాకు వచ్చిన జాతీయ అవార్డుని 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ గతంలో నాకు ఇదే అవార్డులు రాకపోయినప్పుడు కనీసం 10 శాతం మంది కూడా నాకు సపోర్ట్‌గా మాట్లాడలేదు' అని ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో 'కర' సినిమాతో వచ్చిన ధనుష్.. ప్రస్తుతం 'ఓం' సినిమా చేస్తున్నాడు. అక్టోబరు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. 'అమరన్' తీసిన రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లు.

(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement