వేధిస్తుంటే రాఖీ కట్టా.. నాకే షాకిచ్చాడు : అంజలి | Anjali Tied Rakhi To School Classmate Who Kept Proposing To Her | Sakshi
Sakshi News home page

అతనికి రాఖీ కడితే.. నాకే షాకిచ్చాడు : హీరోయిన్‌ అంజలి

Jul 7 2026 4:15 PM | Updated on Jul 7 2026 4:23 PM

Anjali Tied Rakhi To School Classmate Who Kept Proposing To Her

హీరోయిన్‌ అంజలి ఇప్పుడు తమిళ చిత్రం ‘మగుడం’(తెలుగులో మకుటం) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. విశాల్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి.. తన చిన్నప్పుడు జరిగిన ఓ లవ్‌ ప్రపోజల్‌ గురించి చెప్పింది. పదే పదే వేధిస్తున్నాడని రాఖీ కడితే.. అతనే తనకు షాకిచ్చాడని అంజలి చెప్పుకొచ్చింది.

సవాల్‌ చేశాడు.. 
స్కూల్ డేస్‌లో నా క్లాస్‌మేట్‌ ఒకతను ప్రేమ పేరుతో నా వెంబడి పడేవాడు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అతను లవ్‌ ప్రపోజల్‌ చేస్తూనే ఉన్నాడు కానీ నేను పట్టించుకునేదానిని కాదు. ఒకసారి ‘నువ్వు నాకు రాఖీ కట్టి చూడు’ అంటూ అతడు నాకు సవాల్ విసిరాడు. అతని అ​హంకారపు మాటలు నాకు నచ్చలేదు. వెంటనే రాఖీ తీసుకొచ్చి కట్టేశా. ఇక ఆ అబ్బాయి నా వెంటపడడని భావించా. కానీ, అతను నాకు షాకిచ్చాడు. వెంటనే రాఖీ తీసేసి ‘నేను నీకు బ్రదర్‌ని కాలేను.. నేను కన్నన్‌ని’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను నాకు మళ్లీ కనిపించలేదు’ అని అంజలి చెప్పుకొచ్చింది.

ఒకరిపేరు చెబితే..మరొకరి పేరు
ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన ప్రేమ, పెళ్లి గురించి అనేక రూమర్స్‌ వచ్చాయని..ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశానని అంజలి చెప్పారు. ‘పలువురు హీరోలతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అవి చూసి అప్పట్లో చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు లైట్‌ తీసుకుంటున్నా. ‘నేను ఒకరి పేరు చెబితే, మీరు ఇంకొకరి గురించి అడుగుతారు. అందుకే నేను ఎవరి పేరూ చెప్పదలుచుకోలేదు. ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరు’ అని అంజలి చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement