ఆ ఒక్క కారణం వల్లే 'టెంపర్' రీమేక్ చేశా | Vishal Opens Up On Temper Remake, Says Jr NTR’s Performance Was Like A Volcanic Eruption, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

Vishal: ఎన్టీఆర్ నటన చూసి స్క్రిప్ట్ పూర్తిగా మరిచిపోయా

Aug 10 2026 10:57 AM | Updated on Aug 10 2026 11:43 AM

Vishal Reacts Temper Movie Tamil Remake Latest

ఇప్పుడంటే ఓటీటీల రీచ్ కారణంగా రీమేక్ సినిమాలు చాలావరకు తగ్గిపోయాయి. కొన్నేళ్ల ముందు వరకు ఈ ట్రెండ్ విపరీతంగా ఉండేది. ఉదాహరణ తీసుకుంటే తెలుగులో హిట్ అయిన మూవీని తమిళం లేదా కన్నడలో రీమేక్ చేశారు. అలా 2015లో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్'ని నాలుగేళ్ల తర్వాత తమిళంలో 'అయోగ్య' పేరుతో రీమేక్ చేశాడు. చేస్తే చేశారు గానీ మళ్లీ తెలుగులో దాన్ని డబ్బింగ్ చేసి వదిలారు. ఇది చూసి చాలామంది షాకయ్యారు. చేసిందే రీమేక్.. మళ్లీ డబ్బింగ్ కూడానా అని నవ్వుకున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

తాజాగా ఇదే సందేహానికి హీరో విశాల్ స్వయంగా సమాధానమిచ్చాడు. ఇతడు హీరోగా నటించి తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'మకుటం'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆడియెన్స్ నుంచి ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'టెంపర్' క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ మరెవరూ తిరిగి చేయలేరు. అంతటి అద్భుతమైన మ్యాజిక్‌ మరింత మందికి చేరువ కావాలనే ఒక్క ఉద్దేశంతోనే నేను ఈ సినిమాని రీమేక్ చేశాను. ఎన్టీఆర్ యాక్టింగ్ చూస్తున్నప్పుడు అసలు స్క్రిప్ట్ ఏంటనే విషయమే పూర్తిగా మరిచిపోయా. ఆయన ప్లే చేసిన ఎమోషన్స్ నన్ను అలా స్టన్ అయ్యేలా చేశాయి. ఎన్టీఆర్‌ని స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు అగ్నిపర్వతం పేలినట్లు అనిపించింది. ఆయనలోని ఎనర్జీ, ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్. నేను చేసిన రీమేక్‌ని తెలుగులో డబ్బింగ్ చేసిన సంగతి నాకు తెలీదు. ఒకవేళ నేను నిర్మాత అయ్యుంటే ఆ తప్పు చేసేవాడిని కాదు' అని విశాల్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: కాబోయే భార్య గురించి విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement