Singeetham Srinivasarao Birthday Special: అద్భుత ప్రయోగాల తెరమాంత్రికుడు

సాక్షి, హైదరాబాద్: తొంభై వసంతాల నిత్యయవ్వనుడు సింగీతం శ్రీనివాసరావు. దశాబ్దాల తెలుగు సినిమా పరిణామ క్రమానికి ప్రత్యక్ష సాక్షి. తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని పుష్పక విమానంపై ఊయలలూగించారు. జానపదాన్ని ప్రేమించడమేకాదు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుత ప్రయోగాలతో అపురూప కళాఖండాలను ఆవిష్కరించిన తెరమాంత్రికుడాయన. కేవలం దర్శకుడిగానే కాదు, సంగీతంలోను ఔరా అనుపించుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్బంగా స్పెషల్ స్టోరీ...