తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖుల ఎంట్రీపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తన పార్టీతో రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. మరోవైపు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ సైతం తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో శివకార్తికేయన్ పేరు కూడా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం చెన్నైలోని పోరూర్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి సుమారు 3 వేల మంది అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు హాజరయ్యారు. అయితే శివకార్తికేయన్ తన రాజకీయ ప్రవేశంపై ఈ సమావేశంలో ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
బాగా చదవండి. మంచి డబ్బు సంపాదించండి.
అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఈ స్థాయికి రావడానికి మీరే కారణం. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే మన లక్ష్యంపై స్పష్టత ఉండాలి. విమర్శించే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా మన లక్ష్యం దిశగా ముందుకు సాగాలి’ అని సూచించారు.
విద్యార్థులతో మాట్లాడుతూ. ‘బాగా చదవండి. మంచి డబ్బు సంపాదించండి. మీ కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మనం ఎంత ఎక్కువ చదివితే.. మన ఆలోచనా విధానం అంత మెరుగవుతుంది. తద్వారా సామాజిక మాధ్యమాలకు కూడా కొంత దూరంగా ఉండొచ్చు’ అని అన్నారు.
భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా?
అయితే భారీ సంఖ్యలో అభిమానులతో సమావేశం నిర్వహించడం, వారికి లక్ష్యం, క్రమశిక్షణ వంటి అంశాలపై సూచనలు చేయడంతో శివకార్తికేయన్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?
The Massy Frame of #Sivakarthikeyan with his Fans at Fans Meet..🔥👌 https://t.co/8DfEeLkuBw
— Laxmi Kanth (@iammoviebuff007) October 4, 2026


