‘మూకుత్తి అమ్మన్‌2’ చిత్రానికి భారీ ఓటీటీ డీల్‌ | Mookuthi Amman 2 Nayanthara Film OTT Deal | Sakshi
Sakshi News home page

‘మూకుత్తి అమ్మన్‌2’ చిత్రానికి భారీ ఓటీటీ డీల్‌

Aug 21 2026 12:38 PM | Updated on Aug 21 2026 1:16 PM

Mookuthi Amman 2 Nayanthara Film OTT Deal

సుందర్‌.సి దర్శకత్వంలో నయనతార అమ్మవారిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్‌-2’.  2020లో విడుదలైన మూకుత్తి అమ్మన్‌( తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నారు.  ఐసరి గణేష్‌ తన వేల్స్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతోంది.  

ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో హాట్‌స్టార్‌’ భారీ మొత్తానికి డిజిటల్‌ హక్కులు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్‌ విలువ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు.

కీలకంగా రెజీనా..
ఈ సీక్వెల్‌లో నయనతార అ‍మ్మవారి పాత్రలో మరోసారి కనిపిస్తుండగా.. నటి రెజీనా కసాండ్రా ప్రధాన ప్రతినాయికగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌కు రెజీనా కీలకంగా ఉండనున్నట్లు సమాచారం. 2020లో విడుదలైన ‘మూకుత్తి అమ్మన్‌’ చిత్రం తొలి భాగాన్ని ఆర్జే బాలాజీ, ఎన్‌.జే. శరవణన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో నయనతార దేవతగా నటించగా..ఆర్జే బాలాజీ కథానయకుడిగా కనిపించారు. మూఢనమ్మకాలు, నకిలీ స్వామీజీలపై వివిధ అంశాలను సంధిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రధానంగా అటవీ భూములపై కన్నేసిన నకిలీ స్వామీజీ (అజయ్ ఘోష్) బండారాన్ని కథనాయకుడు తమ ఇలవేల్పు అయిన ముక్కుపుడక అమ్మవారు(నయనతార) సహాయంతో బయట పెట్టిన విధానం  ప్రకేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అప్పట్లో కరోనా ఉండడంతో నేరుగా ఓటీటీలో విడుదలైంది.  

కాగా నయనతార కీలక పాత్రలో యశ్‌ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కించిన చిత్రం టాక్సిక్‌. ఆగస్టు 26న విడుదల కానుంది.  అలాగే కవిన్‌తో కలిసి నయనతార నటించిన రొమాంటిక్‌ కామెడీ డ్రామా ‘హాయ్‌’ఆగస్టు 28న విడుదల కానుంది. 

ఇదీ చదవండి: మహేశ్‌బాబు ‘వారణాసి’లో ఎన్ని పాటలంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement