మరో హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సుహాస్.. ఇప్పుడు తమిళంలో విలన్‌గా చేశాడు. పూర్తిగా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ చిత్రం.. ఎప్పుడు ఏ ఓటీటీలోకి రానుందంటే?
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)
తమిళ కమెడియన్ సూరి.. హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'మండాడి'. సుహాస్ విలనిజం చేశాడు. సత్యరాజ్ కీలక పాత్రధారి. వెట్రిమారన్ నిర్మించిన ఈ మూవీకి మదిమారన్ పుగళేంది దర్శకుడు. గతనెల 10న తెలుగు, తమిళంలో రిలీజైంది. యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంది. రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడిది ఈ గురువారం(అక్టోబర్ 08) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.
'మండాడి' విషయానికొస్తే.. సముద్రతీర ప్రాంతమైన కళింగపట్నంలో తరాలుగా పడవ పందేలు జరుగుతుంటాయి. ఆ పోటీల్లో ఎప్పుడూ గెలిచే మండాడి జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు మిత్రులే ముత్తు కాళి (సూరి), సాట్టా పులి (సుహాస్). సముద్రమంతా తెలిసిన ముని (సత్యరాజ్) శిక్షణలో రాటు దేలిన ఆ ఇద్దరూ కాలక్రమంలో బద్ధ శత్రువులవుతారు. పగ, ప్రతీకారాలు వెంటాడుతుండడంతో ముత్తు కాళి ఊరొదిలి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంటాడు.
మల్లేశ్ (మిథున్) అనే యువకుడి కారణంగా చోటు చేసుకున్న అనూహ్యమైన పరిణామాలతో కాళి.. మళ్లీ ఊరికి రావాల్సి వస్తుంది. ఇంతకీ మల్లేశ్ అనే యువకుడు ఎవరు? అతనికీ ముత్తుకాళికీ సంబంధం ఏమిటి? ముత్తుకాళి తిరిగి ఊళ్లోకి వచ్చాక ఏం జరిగింది? సాట్టాపులితో వైరం ఎక్కడివరకూ సాగింది?అసలు వాళ్లిద్దరూ శత్రువులుగా మారడం వెనక కారణాలేమిటి? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
Paaka dhaana poreenga, indha Kaali oda aattatha 😎🔥 https://t.co/vxeR8z5A3F
— Netflix India South (@Netflix_INSouth) October 5, 2026


