ఓటీటీలో మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే? | Pradhama Drishtya Kuttakkar Malayalam Police Story On Netflix | Sakshi
Sakshi News home page

Pradhama Drishtya Kuttakkar OTT: ఓటీటీలో మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Oct 4 2026 8:36 PM | Updated on Oct 4 2026 8:38 PM

Pradhama Drishtya Kuttakkar Malayalam Police Story On Netflix

మలయాళంలో ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సొంతం చేసుకున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్‌’. షాహాద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించారు. సెప్టెంబర్‌ 11న థియేటర్లలో విడుదలైంది.

 ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.  అక్టోబరు 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మలయాళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

ఇదీ కథ..
కారుణ్య నియామకం కింద పోలీస్‌ ఉద్యోగం సంపాదించిన అలీనా అబ్రహాం (పార్వతి తిరువోతు) చుట్టూ ఈ కథ సాగుతుంది. ఓ పోలీస్‌ స్టేషన్‌లో రాత్రి విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసుల చేతుల్లో అనుకోకుండా ఓ నేరం జరుగుతుంది. అయితే నేరాన్ని బయటకు రాకుండా చేసేందుకు అదే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు తమకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు. 

క్రైమ్‌ సీన్‌ గురించి, పోలీస్‌ శాఖలోని విధివిధానాల గురించి పూర్తిగా తెలిసిన వారు కావడంతో.. ఆధారాలు దొరకకుండా నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీనియర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి (విజయరాఘవన్‌) చేపడతారు. దీంతో నేరానికి పాల్పడిన పోలీసులకు, దర్యాప్తు అధికారికి మధ్య మొదలయ్యే మైండ్‌గేమ్‌ కథను ఆసక్తికరంగా నడిపిస్తుంది.

ఎవరికి తెలియకుండా చేసిన నేరాన్ని పోలీసులు ఎలా దాచారు? దర్యాప్తు అధికారి వారికి ఎలా చెక్‌ పెట్టారు? చివరికి అసలు నిజం ఎలా బయటపడింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఉత్కంఠభరితమైన కథనం, ఊహించని మలుపులతో దర్శకుడు షాహాద్‌ ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. మ్యాథ్యూ థామస్‌, వినయ్‌ ఫోర్ట్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇదీ చదవండి: అభిమానులకే ఝలక్‌ ఇచ్చిన జక్కన్న.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని బ్రేక్‌ చేసేలా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement