నాని 'ప్యారడైజ్' సినిమా వచ్చే నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. చెప్పాలంటే ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేయాలి. తొలుత మార్చి అనుకున్నారు కుదరలేదు. ఆగస్టుకి వాయిదా వేశారు కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్‌గా సెప్టెంబరు అంటున్నారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
ఆరు నెలల క్రితం ఈ సినిమాలోని 'ఆయా షేర్' పాట రిలీజ్ చేయగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 'యేషనాగుల' అంటూ అందరికీ తెలిసిన తెలంగాణ ఫోక్ సాంగ్‌ని ఈ మూవీ కోసం రీక్రియేట్ చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లో అనిరుధ్ స్వయంగా ఈ పాటని ఆలపించి రిలీజ్ చేశాడు. యూట్యూబ్, స్ఫూటిఫై లాంటి వాటిలో ఆడియో వదిలారు. వీడియో సాంగ్ కూడా తాజాగా రిలీజ్ చేశారు.
సోషల్ మీడియాలో 'యేషనాగుల' సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. ఒరిజినల్ పాట పాడిన జంగిరెడ్డి దీనిని కూడా అలపించగా, ఈయనతో పాటు ప్రభ కూడా పాడింది. సినిమాకు తగ్గట్లు కొన్ని కొత్త లిరిక్స్ కాసర్ల శ్యామ్ రాశారు. మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ పాట ప్రస్తుతం శ్రోతలకు తెగ నచ్చేస్తోంది.


