జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి బిగ్‌ ప్లాన్..! | Venkatesh Anil Ravipudi Movie To Feature A Grand Special Song With Two Heroines, Deets Inside | Sakshi
Sakshi News home page

January 12 vidudhala: జనవరి 12 విడుదల.. డైరెక్టర్ స్పెషల్ ప్లాన్..!

Aug 23 2026 10:39 AM | Updated on Aug 23 2026 11:08 AM

Anil Ravipudi Big Plan For Upcoming January 12 vidudhala Movie

వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మరో మూవీ జనవరి 12 విడుదల. ఇటీవలే ఈ సినిమా టైటిల్ అ‍నౌన్స్ చేశారు. డేట్‌తో మూవీ టైటిల్ ప్రకటించి మరింత క్యూరియాసిటీ పెంచేశారు. ఈ మూవీలో వెంకీతో పాటు కల్యాణ్‌రామ్ కూడా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పటాస్‌ సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి మరోసారి మల్టీస్టారర్‌తో వచ్చే సంక్రాంతికి అలరించేందుకు రెడీ అయిపోయారు.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ మూవీలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండనుందని తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన పాట కోసం మూవీ టీమ్ భారీగానే ప్లాన్ చేస్తోందట. ఈ సాంగ్ కోసం ఓ భారీ సెట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో విజువల్స్‌ అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. వచ్చేనెల మొదటి వారంలో ఈ పాట చిత్రీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో హీరోలతో పాటు ఇద్దరు హీరోయిన్స్‌ స్టెప్పులతో అదరగొట్టనున్నారని టాక్.

కాగా.. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌ లోపే షూట్ పూర్తయ్యేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement