breaking news
January 12
-
జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్..!
వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మరో మూవీ జనవరి 12 విడుదల. ఇటీవలే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. డేట్‌తో మూవీ టైటిల్ ప్రకటించి మరింత క్యూరియాసిటీ పెంచేశారు. ఈ మూవీలో వెంకీతో పాటు కల్యాణ్‌రామ్ కూడా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పటాస్ సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి మరోసారి మల్టీస్టారర్‌తో వచ్చే సంక్రాంతికి అలరించేందుకు రెడీ అయిపోయారు.తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన పాట కోసం మూవీ టీమ్ భారీగానే ప్లాన్ చేస్తోందట. ఈ సాంగ్ కోసం ఓ భారీ సెట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో విజువల్స్ అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. వచ్చేనెల మొదటి వారంలో ఈ పాట చిత్రీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో హీరోలతో పాటు ఇద్దరు హీరోయిన్స్ స్టెప్పులతో అదరగొట్టనున్నారని టాక్.కాగా.. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లోపే షూట్ పూర్తయ్యేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. -
పండగొచ్చె.. పతంగులకు..!
-
పండగొచ్చె.. పతంగులకు..!
రాష్ట్రంలో అంతర్జాతీయ వేడుకగా నిర్వహణ జనవరి 12 నుంచి వారం రోజులపాటు.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్జాతీయ పతంగుల పండగను అహ్మదాబాద్‌కు దీటుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 12 నుంచి వారం పాటు వేడుకలు జరగనున్నాయి. 16 దేశాలకు చెందిన అంతర్జాతీయ పతంగుల నిపుణులు ఇందులో పాల్గొనబోతున్నారు. వీరుగాక మరో 32 దేశాలకు, దేశంలోని 15 కైట్ క్లబ్‌లకు అధికారులు ఆహ్వానాలు పంపారు. తొలుత 12వ తేదీ రాత్రి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నైట్ కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. 14, 15 తేదీల్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలోని ఆగాఖాన్ అకాడమీ ప్రాంగణంలో వేడుకలు నిర్వహించనున్నారు. 16, 17 తేదీల్లో వరంగల్‌లో ఉత్సవాలు జరుపుతారు. హైదరాబాద్‌లోని 15 పెద్ద పాఠశాలలను కూడా వేడుకల కోసం గుర్తించారు. ఒక్కో పాఠశాలలో వేరుు మంది చొప్పున విద్యార్థులు పాల్గొననున్నారు. పతంగుల వేడుకను బాలిక విద్య ఇతివృత్తంగా నిర్వహించనున్నారు. సందర్శకులు కొనే టికెట్ల రూపంలో వచ్చే మొత్తాన్ని ఇద్దరు పేద బాలికలు నిజామాబాద్‌కు చెందిన రాధ, హైదరాబాద్‌కు చెందిన నిఖితలకు స్కాలర్‌షిప్స్‌గా ఇవ్వనున్నారు. తెలంగాణకు కొత్త కీర్తి అంతర్జాతీయ పతంగుల ఉత్సవం ద్వారా తెలంగాణకు మంచి ఖ్యాతి రానుంది. ఈ ఏడాది 16 దేశాలకు చెందిన నిపుణులు వస్తుండటం దీనికి బలం చేకూరుస్తుంది. వచ్చే ఏడాది నుంచి పర్యాటకులు పోటెత్తుతారు. - మంత్రి చందూలాల్ 2020కి లక్ష మంది.. గతేడాది తమ క్లబ్ సభ్యులను పంపేందుకు అహ్మదాబాద్ వెనకాడింది. ఈసారి ఉమ్మడిగా వేడుకలు నిర్వహిద్దామని కోరింది. 2020లో లక్ష మంది పర్యాటకులు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. - బుర్రా వెంకటేశం, పర్యాటక శాఖ కార్యదర్శి


