'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబు.. జయహో జనార్ధన సినిమాలోని 'చిందువేయవే చాందుక తుకడ' అనే పాటని రిలీజ్ చేశారు. 'ఆయా షేర్' పాడిన జంగి రెడ్డి దీనిని ఆలపించారు. చరణ్ అర్జున్ సంగీతమందించారు. పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న సినిమా ఇది. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లు కాగా 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి తదితరులు ఇతర పాత్రలు చేశారు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లాంచ్ డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా జరిగింది. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది . త్వరలోనే టీజర్ , ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత, దర్శకుడు అయిన పానుగంటి శరత్ రెడ్డి తెలిపారు.


