breaking news
Panchanama Series
-
వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి ఎపిక్, మారెమ్మ, మహేంద్ర గిరి వారాహి, మండాడి, సర్దార్ 2 సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో దేనికి కూడా సూపర్ హిట్ అనే టాక్ రాలేదు. వీటిని చూసిన చాలామంది ఓకే పర్లేదని అంటున్నారు. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో పలు తెలుగు హిట్ సినిమాలతో పాటు డబ్బింగ్‌లు కూడా ఉన్నాయి.ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్', విశాల్ 'మకుటం', మహారాజా హాస్టల్, పంచనామా, కట్టాలన్, వరవు లాంటి చిత్రాలు, సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (సెప్టెంబరు 11)అమెజాన్ ప్రైమ్మకుటం -తెలుగు డబ్బింగ్ సినిమామహారాజ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీమ్యాజిక్ మష్రూమ్స్ - మలయాళ చిత్రంఅచ్యుత అవతారం - మలయాళ సినిమాడియోల్ బాంద్ 2 - మరాఠీ చిత్రంసల్మోఖ్జీ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సినిమారక్కసపురదోళ్ - కన్నడ మూవీద రివల్యూషనరీస్ - తెలుగు డబ్బింగ్ సిరీస్నెట్ఫ్లిక్స్విశ్వనాథ్ అండ్ సన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాగో టీమ్ - స్పానిష్ మూవీచుంబక్ - హిందీ సిరీస్కాల్ మై ఏజెంట్! ద మూవీ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్ద పేపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్అలీబాబా ఔర్ 40 భూత్ - హిందీ సిరీస్ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్వన్ నైట్ వోయెజ్ - జపనీస్ సిరీస్లిబాంగ్ లిబు - మలేషియన్ మూవీజంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ - హిందీ సిరీస్ (సెప్టెంబరు 12)జీ5పంచనామా - తెలుగు సిరీస్ఘమసాన్ - హిందీ సిరీస్అద్కిట్టా - మరాఠీ మూవీఆహాకట్టాలన్ - తెలుగు డబ్బింగ్ సినిమావరవు - తెలుగు డబ్బింగ్ మూవీవెంజన్స్ - తమిళ చిత్రంసన్ నెక్స్ట్వివాహ్ - మలయాళ సినిమాలయన్స్ గేట్ ప్లేహంగ్రీ - తెలుగు డబ్బింగ్ మూవీ -
మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘పంచనామా’ సిద్ధమైంది. మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది.ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత, నటి ఉదయభాను చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఎక్కువ మంది చదివింది: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ ?స్వయం కృషితో ఎదిగా..చిన్న వయసు నుంచే మైక్ పట్టుకుని స్వయం కృషితో ఎదిగానని ఆమె తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒంటరిగానే నిలబడ్డానని చెప్పారు. ‘ఎవరికి టాలెంట్ ఉన్నా.. ఏ డోర్ మూసుకుపోయినా.. ఉదయభాను ప్రొడక్షన్స్ ఉందని మర్చిపోవద్దు. ఎవరి దగ్గర సత్తా ఉన్నా.. ఈ ప్రొడక్షన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని ఉదయభాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇదీ చదవండి: ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉంటుందంటే?x.com/FilmyFocus/status/2097604851358457984?s=20 -
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వివిధ భాషల్లో రిలీజయ్యే థ్రిల్లర్స్ వీలైనంత ఎక్కువగా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే దాదాపు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అన్నీ ఈ జానర్లోని సినిమాలు, సిరీస్‌లని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)'ప్రేమిస్తే' లాంటి డబ్బింగ్ బొమ్మతోపాటు పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు భరత్.. ప్రధాన పాత్ర చేసిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా'. మేధారెడ్డి, ఉదయభాను కీలక పాత్రలు చేశారు. సెప్టెంబరు 11 నుంచి జీ5 ఓటీటీలో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ వీడియోని వదిలారు.యాంకర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. చాన్నాళ్లకు మళ్లీ యాంకరింగ్, మరోవైపు యాక్టింగ్ చేస్తూ కాస్తంత బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. అలా ఈ సిరీస్‌లోనూ నటించింది. మరి 'పంచనామా' ఏమైనా ఉదయభాను ఫేట్ మారుస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)SEP 11th 💥💥THE INVESTIGATION BEGINS...🕵️♂️#Panchanama premieres on September 11th, only on #TeluguZee5#BharathNiwas #MedhaReddy #UdayaBhanu#PamchanamaFromSep11 #PanchanamaOnTeluguZee5 pic.twitter.com/NbpDV3v2HW— ZEE5 Telugu (@ZEE5Telugu) August 29, 2026


