రాజ్‌తరుణ్, నరేంద్ర కొండ, ‘దిల్’ రాజు, శివ రాజ్‌కుమార్, వరలక్ష్మి
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కూర్మావతార్’. హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్‌తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నరేంద్ర కొండ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్–రుక్వీణ స్టూడియోస్‌పై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కూర్మావతార్’ టీజర్ బాగుంది. ‘మహావతార్ నరసింహ’, ‘ఇరుముడి’ చిత్రాల్లా ‘కూర్మావతార్’ కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను.
‘ఇరుముడి’ సినిమా మా అందరిలో గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్స్‌కు వస్తుంటే మా అందరికీ ధైర్యం వస్తోంది’’ అన్నారు. శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ–‘‘కూర్మావతార్’ సినిమాలో భాగం కావడం నా అదృష్టం. హర్ష అద్భుతమైన విజన్ తో ఈ సినిమా తీశారు’’ అని చెప్పారు. ‘‘శివ రాజ్‌కుమార్ గారితో కలిసి నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’’ అని సాయికుమార్ పేర్కొన్నారు.
‘‘కూర్మావతార్’ నా తొలి సినిమా’’ అన్నారు హర్ష వర్ధన్ . ‘‘విష్ణుమూర్తి రెండో అవతారం కథతో ఈ సినిమా తీయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు నరేంద్ర కొండ, పూజిత. ఈ కార్యక్రమంలో నటి వరలక్ష్మి, రాజ్ తరుణ్, సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ మాట్లాడారు.


