'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్ | Ravi Teja Irumudi Movie Irumudi Kattu Video Song Released, Watch Full Video Inside | Sakshi
Sakshi News home page

Irumudi Movie: ఉర్రూతలూగించిన 'ఇరుముడి' పాట పూర్తి వీడియో

Aug 31 2026 10:01 AM | Updated on Aug 31 2026 11:28 AM

Irumudi Movie Irumudi Kattu Video Song Full

గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు లైఫ్ టైమ్ తగ్గిపోయింది. అంటే మూడు నాలుగు రోజులకే జనాలు చాలా చిత్రాల్ని లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి టైంలో రవితేజ 'ఇరుముడి' అద్భుతాలు చేస్తోంది. థియేటర్లలో రిలీజై 10 రోజులు దాటినా సరే చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జనాలు ఈ మూవీని బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఇష్టపడుతున్నారు. మరోవైపు ఈ మూవీలో అయ్యప్ప హిట్ పాట పూర్తి వీడియోని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)

అయ్యప్ప దీక్ష నేపథ్యంగా తీసిన 'ఇరుముడి'లో ఎంతో ఫేమస్ అయిన 'మల్లెపూల పల్లకి'తో పాటు 'ఇరుముడి కట్టు' అంటూ సాగే గీతం కూడా ఉంది. ఇప్పుడు దీని పూర్తి వీడియోనే విడుదల చేశారు. రవితేజ పోషించిన త్రినాథ్ పాత్ర.. అయ్యప్ప దీక్షని తీసుకునే క్రమంలో ఈ సాంగ్ ఉంటుంది. ఇందులో అయ్యప్ప భక్తుల నృత్యంతో పాటు రవితేజ-పాప కూడా కలిసి డ్యాన్స్ చేస్తారు.

ఇకపోతే 'ఇరుముడి'కి ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. చూస్తుంటే రూ.200 కోట్ల మార్క్ చేరుకునేవరకు ఈ సినిమా జోరు ఆగేలా లేదు. ఇకపోతే ఈ మూవీతో చాన్నాళ్ల తర్వాత రవితేజ అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement