భక్తి... భావోద్వేగం... | Allari Naresh Kanaka Durga movie satellite and digital rights: Z5 Telugu | Sakshi
Sakshi News home page

భక్తి... భావోద్వేగం...

Aug 31 2026 3:48 AM | Updated on Aug 31 2026 3:48 AM

Allari Naresh Kanaka Durga movie satellite and digital rights: Z5 Telugu

‘అల్లరి’ నరేష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కనకదుర్గ’ అనే టైటిల్‌ ఖరారైంది. ఈ చిత్రంలో కాజల్‌ చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వంలో బిర్లా స్టూడియోస్, టెంపుల్‌ టౌన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ముందుగా థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతుంది. ఆ తర్వాత జీ5 తెలుగులో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందని మేకర్స్‌ తెలిపారు.

‘‘భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం... ఇలా అన్ని అంశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సర్వశక్తిమంతమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్యశక్తి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నుంచి స్ఫూర్తి పొంది, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. భక్తి భావాన్ని ఆవిష్కరిస్తూనే, ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో చక్కని అనుభూతినిచ్చేలా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement