దండాలయ్యా రీమిక్స్‌ అయ్యా? | Venkatesh Dandalayya Song Remixed for Aadarsha Kutumbam | Sakshi
Sakshi News home page

దండాలయ్యా రీమిక్స్‌ అయ్యా?

Aug 31 2026 3:40 AM | Updated on Aug 31 2026 3:40 AM

Venkatesh Dandalayya Song Remixed for Aadarsha Kutumbam

వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం: 47 – ఏకే47’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా వెంకటేష్‌ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ మూవీ ‘కూలీ నెం1’లోని పాపులర్‌ సాంగ్‌ ‘దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా’ను ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కోసం రీమిక్స్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. 

ఒకవేళ ఈ పాటను రీమిక్స్‌ చేసినట్లయితే వెంకటేష్‌ అభిమానులకు మరోసారి ఫెస్టివల్‌ ఫీస్ట్‌ ఇచ్చినట్లు అవుతుందని చెప్పాచ్చు. మరి... వార్తల్లో ఉన్నట్లు ‘దండలయ్యా...’ని రీమిక్స్‌ చేస్తున్నారా? లేదా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 2న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు గతంలో మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఆ తేదీకి విడు దల కాకపోవచ్చని, అదే నెలలో 9 లేదా 16న విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement