వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’లో మరో ఎట్రాక్షన్? | Another attraction in Venkatesh Trivikram Aadarsha Kutumbam | Sakshi
Sakshi News home page

వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’లో మరో ఎట్రాక్షన్?

Aug 29 2026 11:27 PM | Updated on Aug 29 2026 11:27 PM

Another attraction in Venkatesh Trivikram Aadarsha Kutumbam

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో వెంకీ నటించిన ‘కూలీ నంబర్ 1’లోని ఎవర్‌గ్రీన్ సాంగ్‌ ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా’ పాటను రీమిక్స్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకల్లో వినిపించే ఎంతో ఫేమస్ అయిన ఈ పాటను కొత్త బీట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను తనదైన స్టైల్‌లో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఏ సందర్భంలో ఈ పాటను పెట్టారన్నది ఆసక్తికరంగా మారింది.

శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ తొలి వారంలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement