మంగా శ్రీనివాస్, పూరి జగన్నాథ్, హేమారావు
శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా ‘చకోర: లూనార్ లవ్ బర్డ్’. దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో డా. చింతాడ హేమారావు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 8న విడుదల కానుంది.
ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్‌ని పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకు తెలుగులో వచ్చిన ప్రేమకథలకు భిన్నమైన లవ్‌స్టోరీతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త లవ్ ఫీల్‌ను అందిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ప్రిన్స్ హెన్రీ.


