సినిమా చూస్తున్నప్పుడు సరదాగా ఉంటుంది. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడో ఓసారి సదరు చిత్రాల్లో నటించిన వాళ్లు చెబితే తప్పితే ఆ సంగతులు బయటపడవు. ఇప్పుడు అలానే తమిళ హీరో సూరి.. 'మండాడి' చిత్రం విషయంలో తనకెదురైన చిత్రమైన ఫన్నీ అనుభవాన్ని పంచుకున్నాడు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఆడియో లాంచ్ సందర్భంగా ఇదంతా చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: తమిళ హీరో కాళ్లు మొక్కిన తెలుగు హీరో సుహాస్)
'మండాడి సినిమా కమిట్ అయినప్పుడు 80 శాతం చిత్రీకరణ స్విమ్మింగ్ పూల్‌లో, 20 శాతం నిజమైన సముద్రంలో చేస్తామని దర్శకుడు చెప్పారు. వెట్రిమారన్ కూడా.. టైటానిక్ సహా ఎన్నో సముద్ర నేపథ్య సినిమాలు స్విమ్మింగ్ పూల్‌లోనే తీశారని చెప్పారు. దీంతో నేను ఓకే అనేశా. కానీ షూటింగ్ మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది'
'10 రోజులు గడిచాయి. నెలరోజులు గడిచాయి. రెండు నెలలు అయిపోయాయి. అయినా షూటింగ్ మాత్రం నిజమైన సముద్రంలో చేస్తున్నారు. నన్ను ఇక్కడి నుంచి పంపించకపోయేసరికి నా భార్య తెగ భయపడిపోయి ప్రతిరోజూ ఫోనే చేసేసేది. కానీ నేను ఎత్తలేకపోయేవాడిని. దీంతో రెండురోజులకు ఓసారి నేనే ఆమెకు ఫోన్ చేసి 'నేను బతికే ఉన్నాను' అని చెప్పేవాడిని' అని సూరి నవ్వుతూ ఈ సినిమా అనుభవాన్ని పంచుకున్నాడు.
తెలుగు హీరో సుహాస్ ఈ మూవీలో విలన్‌గా చేశాడు. వచ్చే నెల 10వ తేదీన తెలుగు, తమిళంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. పూర్తిగా సముద్రం బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. అయితే సముద్రంలో తీస్తున్న టైంలో ఒకటిరెండుసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి.
(ఇదీ చదవండి: 40 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులకు కారణం నేనే: 'జైలర్' విలన్)
#Soori's Fun speech 😁:
"While committing #Mandaadi director told 80% of the film we will shoot in Swimming pool & 20% only in actual sea. Even VetriMaaran sir told, #Titanic & many other sea films was shoot on Swimming pool😂. 10 days gone...1 month gone...2 months gone shooting… pic.twitter.com/vSeVTged2v— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2026


