'జైలర్' సినిమాలో రజనీకాంత్ ఎంతలా హైలైట్ అయ్యారో.. విలన్‌గా చేసిన వినాయకన్ కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న ఈ నటుడు.. ఎప్పుడో ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. గతంలో పలుమార్లు ఇతడిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఆ సంగతులన్నీ పక్కనబెడితే ప్రస్తుతం ఇతడు ఒంటరిగా ఉంటున్నాడు. 40 ఏళ్ల పాటు కలిసి బతికిన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. అన్నింటికీ తన ప్రవర్తనే కారణమని చెప్పాడు.
(ఇదీ చదవండి: న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న తెలుగు హీరో)
'నాకు ఒక భార్య ఉండేది. ఇప్పుడు మేం విడివిడిగా ఉంటున్నాం. మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు కానీ కలిసి బతకడం కష్టమని విడిపోయాం. నాకు 19 ఏళ్లున్నప్పుడు ఆమెని తొలిసారి కలిశాను. మహారాజాస్ కాలేజీలో మా ప్రేమకథ మొదలైంది. తర్వాత పెళ్లి చేసుకున్నాం. దాదాపు 40 ఏళ్ల పాటు కలిసి బతికాం. ఇప్పుడు ఆమె నా జీవితంలో లేకపోవడం చాలా కష్టంగా అనిపిస్తోంది. చెప్పాలంటే డబ్బు వ్యవహారాలని చూసుకోవడం నాకు ఇబ్బందిగా మారింది. నా దగ్గర గూగుల్ పే లాంటివి కూడా లేవు. అవన్నీ ఆమెనే చూసుకునేది'
'ఆమె నన్ను భరించలేకపోయింది. అది ఆమె తప్పు కాదు. నేను ఆమెకు ప్రశాంతత ఇవ్వలేదు. ఎప్పుడూ గొడవలు, గందరగోళంతో ఉండేసరికి కలిసి బతకడం కంటే విడిపోవడమే ఇద్దరికీ మంచిదని అనుకున్నాం. అయినప్పటికీ ఆమె నాకు సంబంధించిన చాలా విషయాలు చూసుకుంటోంది. నా యూట్యూబ్‌కి రీఛార్జ్ కూడా చేస్తోంది. నేను ప్రతి విషయాన్ని ఆమెతో చెప్పేవాడిని. ఇప్పుడు ఆమె నా జీవితంలో లేదు. దీంతో నా జీవితం చీకటిగా మారిపోయింది' అని నటుడు వినాయకన్ భావోద్వేగానికి గురయ్యాడు.
మూడేళ్ల క్రితం వినాయకన్-బబిత విడిపోయారు. ఆమె బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. వినాయకన్ విషయానికొస్తే.. నటుడిగా చాలా పేరుంది. చతిక్కాత్త చంతు, చింతామణి కొలకేస్, బిగ్ బి, బ్యాచిలర్ పార్టీ, మరియన్, ఆడు, చంద్రెట్టన్ ఎవిడయా, కమ్మటిపాదం, ఆడు 2, ఈ మా యౌ, తొట్టప్పన్, పడ, ఒరుత్తీ, ఆడు 3 తదితర సినిమాల్లో నటించాడు. వంటి చిత్రాల్లో ఆయన తనదైన నటనతో మెప్పించారు. ఇకపోతే 'కమ్మటిపాదం' సినిమాకుగానూ కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్నాడు. ఇలాంటి నటుడి జీవితం, విడాకుల వల్ల అయోమయంగా మారిపోయింది.
(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)


