ఫీనిక్స్‌ రాజా ఫిక్స్‌ | Sriwass upcoming film Phoenix Raja motion teaser released | Sakshi
Sakshi News home page

ఫీనిక్స్‌ రాజా ఫిక్స్‌

Aug 29 2026 3:27 AM | Updated on Aug 29 2026 3:27 AM

Sriwass upcoming film Phoenix Raja motion teaser released

దర్శకుడు శ్రీవాస్‌ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. మాధవి క్రియేషన్స్‌పై మహంకాళి నాగరాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఫీనిక్స్‌ రాజా’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఫీనిక్స్‌ రాజా’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో  పాటు రెండు నిమిషాల 2డీ మోషన్‌ టీజర్‌ను విడుదల చేశారు. శ్రీవాస్‌ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనలను, ప్రభావవంతమైన కథనంతో కొత్త బెంచ్‌మార్క్‌ సెట్‌ చేయడమే లక్ష్యంగా ఈ సినిమా రూపొందిస్తున్నాం. 

ఈ చిత్రకథ ఓ నిజాయితీగల వ్యా పారవేత్త చుట్టూ తిరుగుతుంది. రాజకీయ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించుకోకుండా కష్టపడి, విలువలు, నిజాయితీతో జీవితాన్ని నిర్మించుకోవాలని భావించే అతడి జీవితంలోకి పవర్‌ఫుల్‌ వ్యక్తులు ప్రవేశించినప్పుడు అతడి వ్యక్తిగత పోరాటం నిజం, గౌరవం, భవిష్యత్‌ తరాల కోసం జరిగే పెద్ద పోరాటంగా మారుతుంది. ఈ చిత్రంలో మరో కీలక అంశంగా జెన్‌ జీపై పెరుగుతున్న డ్రగ్‌ మాఫియా ప్రభావాన్ని చూపించనున్నాం. ఇంగ్లిష్‌తో  పాటు పలు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రాన్ని భారత్‌లోని వివిధ ప్రాంతాలతో  పాటు విదేశాల్లోనూ చిత్రీకరిస్తాం’’ అని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement