క్రైమ్‌ థ్రిల్లర్‌ | Prithviraj Sukumaran Dayara trailer released | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ థ్రిల్లర్‌

Sep 1 2026 12:06 AM | Updated on Sep 1 2026 12:06 AM

Prithviraj Sukumaran Dayara trailer released

బాలీవుడ్‌ హీరోయిన్  కరీనా కపూర్, మలయాళ నటుడు, దర్శక–నిర్మాత పృథ్వీరాజ్‌ సుకుమారన్  ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా ‘దయారా’. నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కించారు. జంగ్లీ పిక్చర్స్, డాక్టర్‌ జయంతీలాల్‌ గడా సమర్పణలో వినీత్‌ జైన్ , ధవల్‌ గడా నిర్మించిన ఈ మూవీ హిందీ, మలయాళ భాషల్లో ఈ నెల 18న రిలీజ్‌ కానుంది. 

సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన డీసీపీ అజూనీ కోహ్లి రోల్‌ నా మనసులో చాలా కాలం నిలిచి΄ోతుంది’’ అని చెప్పారు కరీనా కపూర్‌. ‘‘మనుషుల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథ ఇది’’ అని తెలిపారు పృథ్వీరాజ్‌ సుకుమారన్ . ‘‘గ్రే షేడ్స్‌తో కూడిన పాత్రలు ఉన్న ‘దయారా’ ప్రపంచంలోకి ప్రేక్షకులను ఆహ్వానించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను’’ అని తెలిపారు మేఘనా గుల్జార్‌. ఈ చిత్రంలో జితేంద్ర జోషి, క్షితీ జోగ్, కన్వల్‌జీత్‌ సింగ్, సందీప్‌ కులకర్ణి ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement