తనయుడికి స్పెషల్ విషెస్.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్ | Mahesh Babu Special Wishes To His Son Gautham Ghattamaneni | Sakshi
Sakshi News home page

Mahesh Babu: తనయుడికి స్పెషల్ విషెస్.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్

Aug 31 2026 6:27 PM | Updated on Aug 31 2026 6:47 PM

Mahesh Babu Special Wishes To His Son Gautham Ghattamaneni

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తనయుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు గౌతమ్ బర్త్ డే కావడంతో కుమారుడితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. నీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో నేరవేర్చుకోవాలని ఆకాంక్షించారు.

మహేశ్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..' ఘట్టమనేని గౌతమ్‌కు 20వ పుట్టినరోజు శుభాకాంక్షలు.ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నప్పుడు నీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో నేరవేర్చుకోవాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు నిన్ను చూసి గర్వపడుతున్నా' అంటూ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం గౌతమ్‌కు బర్త్‌ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement