యాక్షన్ సినిమాలకు 1990ల దశకం ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే,’ ‘ది ఫ్యుజిటివ్,’ ‘స్పీడ్,’‘హీట్,’‘ది రాక్,’ ఎయిర్ ఫోర్స్ వన్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు సినీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాయి. అలాంటి సన్నివేశాల్లో ఒకటైన హీట్ (1995)లోని రెస్టారెంట్ సీన్‌కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. సినిమా చరిత్రలోనే ‘గొప్ప డైలాగ్ ఎక్స్‌ఛేంజ్’గా ఈ సన్నివేశం ఓ మైలురాయిగా నిలిచింది.
తొలిసారి ఎదురెదురుగా..
మైఖేల్ మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీట్’లో అల్ పచినో, రాబర్ట్ డి నీరో ప్రధాన పాత్రల్లో నటించారు. పోలీస్ అధికారి విన్సెంట్ హన్నా (అల్ పచినో), ప్రొఫెషనల్ నేరస్థుడు నీల్ మెక్‌కాలీ (రాబర్ట్ డి నీరో) మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఓ భారీ దోపిడీకి రెడీ అవుతున్న టైంలో మెక్‌కాలీని కాఫీ కోసం ఓ రెస్టారెంట్‌కు హన్నా ఆహ్వానిస్తాడు. అప్పటివరకు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవని వీరిద్దరూ తొలిసారి ఎదురెదురుగా కూర్చొని తమ జీవితాలు, ఎదుర్కొన్న కష్టాలు, నేరం, పోలీసు వృత్తి గురించి మాట్లాడుకుంటారు.
ఇదీ చదవండి: ప్రభాస్‘స్పిరిట్’షూటింగ్.. హైదరాబాద్‌లోనే ఎందుకంటే?
ఓ డైలాగ్ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది..
ఈ సన్నివేశంలో మెక్‌కాలీ చెప్పే ఓ డైలాగ్ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ‘పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఎలాంటి అనుబంధానికీ తాను లోనుకాను’ అని అతను చెప్తాడు. చివర్లో హన్నా తనను అడ్డుకుంటే మెక్‌కాలీని పట్టుకోవడానికి వెనుకాడనని అంటాడు. అదే సమయంలో తన దారికి అడ్డొస్తే హన్నాను చంపడానికి కూడా తాను వెనుకాడనని మెక్‌కాలీ అంటాడు. ఒకరినొకరు గౌరవిస్తూనే ప్రత్యర్థులుగా నిలిచే ఈ సంభాషణ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ఇద్దరి నటుల మధ్య పోరు
‘ఫార్ అవుట్ మ్యాగజైన్’కు చెందిన టామ్ టేలర్ రూపొందించిన ‘ది 10 గ్రేటెస్ట్ డైలాగ్ ఎక్స్‌ఛేంజెస్ ఇన్ మూవీ హిస్టరీ’ జాబితాలో ఈ రెస్టారెంట్ సీన్‌కు మొదటి స్థానం దక్కింది. ఇద్దరు స్టార్ నటులు తమ నటనా ప్రతిభతో ఈ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని టేలర్ పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివింది: అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ పెట్టా..: విష్టుప్రియ
మరో ఆసక్తికరమైన విషయం..
ఇక ఈ సన్నివేశానికి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అల్ పచినో, రాబర్ట్ డి నీరో ఈ సీన్‌ను షూట్ చేయడానికి ముందు రిహార్సల్ చేయలేదట. హన్నా, మెక్‌కాలీ పాత్రలు అప్పటివరకు ముఖాముఖిగా కలవలేదు కాబట్టి ప్రాక్టిస్ చేయకుండానే నేరుగా సీన్ షూట్ చేస్తే సహజంగా ఉంటుందని డి నీరో భావించారట. దర్శకుడు మైఖేల్ మాన్ అందుకు ఓకే చెప్పడంతో ఆ సన్నివేశం అలా చిత్రీకరించారట.
చదవండి: నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండ


