నాకూ బ్రేకప్‌ అయింది: విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda About Love Breakup In Romanchakam Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

నాకూ బ్రేకప్‌ అయింది: విజయ్‌ దేవరకొండ

Sep 1 2026 2:35 PM | Updated on Sep 1 2026 2:39 PM

Vijay Devarakonda About Love Breakup In Romanchakam Movie Pre Release Event

వేణుగోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనీల్‌కుమార్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని రామానాయడు స్డూడియోస్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశాడు.

 మద్యం మానేయడం, ప్రేమలో పడటం, బ్రేకప్‌ ఎదుర్కోవడం, చివరకు పెళ్లి చేసుకోవడం.. ఇలా తన జీవితంలో చోటుచేసుకున్న కీలక మలుపులను గుర్తుచేసుకున్నారు. ‘రొమాంచకం’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రేమ, బ్రేకప్‌, మద్యం మానేయడం, పెళ్లి వంటి అంశాలపై ఓపెన్‌గా మాట్లాడటంతో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

బ్రేకప్‌ అయింది..
తన జీవితంలోని జరిగిన కొన్ని అనుభవాలని విజయ్‌ వివరిస్తూ..  ‘నేను ఆల్కహాలిక్‌ని. డబ్బులు ఉన్నా లేకపోయినా విస్కీ తాగేవాడిని. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మద్యం మానేయాలని నిర్ణయించుకున్నా. తర్వాత ప్రేమలో పడ్డా.  బ్రేకప్‌ అయ్యింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా. ఏదేమైనా.. ఇదంతా థ్రిల్లింగ్‌ అనుభవమే’ అని విజయ్‌ తెలిపారు. 

ఇదీ చదవండి: ‘కల్కి2​‍’పై బిగ్‌ అప్‌డేట్‌..!

ప్రస్తుతం రణబాలితో..
ఇదే సందర్భంలో వదినమ్మ ఎలా ఉంది అని అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘రష్మిక బాగుంది. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. పని నుంచి విరామం తీసుకుని రిలాక్స్‌ అవుతోంది’ అని చెప్పారు.  కాగా విజయ్‌, రష్మిక కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో నటించారు.  ప్రస్తుతం వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకుడు.  అక్టోబర్‌ 16 ఈ సినిమా విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement