సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఘటన జరిగింది.
నడుచుకుంటూ వెళ్తున్న నందులాల్‌ను ఇన్నోవా కార్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. నందులాల్‌ను కారుతో ఢీకొట్టిన సందీప్.. ఆగకుండా వెళ్లిపోయాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు.


