breaking news
Art director
-
ఆర్ట్ మాఫియా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
‘‘నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌గారు ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ‘ఆర్ట్ మాఫియా’ అంటూ ఆర్ట్ డైరెక్టర్ల గురించి మాట్లాడటం బాధాకరం. ఆ వ్యాఖ్యల్ని ఆయన ఉపసంహరించుకోవాలి’’ అని ‘తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్’ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు రమణ వంక, ప్రధాన కార్యదర్శి కేఎం రాజీవ్ నాయర్, కోశాధికారి ఎం. తిరుమల బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సినిమాలో కథను అనుసరించి దర్శకుల ఊహను దృశ్యరూపంలో చూపించడంలో కళా దర్శకులు చాలా కీలకం. సృష్టికి ప్రతిసృష్టిని దృశ్యరూపంలో చూపించే మేథా సంపత్తి కలిగిన అతిముఖ్యమైన విభాగమే కళాదర్శకత్వ విభాగం. అంతటి విలువైన, ప్రాముఖ్యత కలిగిన మా విభాగంపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌గారు ‘ఆర్ట్ మాఫియా’ అంటూ చేసిన వ్యాఖ్యలను మేము(కళా దర్శకత్వ, ఆర్ట్ డైరెక్టర్స్) ఖండిస్తున్నాం. ఇటీవల కాలంలో ఆయన పలు సినిమాలు నిర్మిస్తూ ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించారు, కల్పిస్తున్నారు.. ఇందుకు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు. అయితే సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. సెట్స్‌లోనూ మార్పులు చేయాల్సి వస్తుంది. నిర్మాతల అనుమతితోనే మార్పులు చేస్తాం. అలాంటప్పుడు ఖర్చులు పెరుగుతాయి. కొన్నిసార్లు తగ్గుతాయి. ఈ విషయంపై ఏ నిర్మాతకైనా అవగాహన, ఆలోచన ఉంటుంది. మీడియాలో మా గురించి తప్పుగా మాట్లాడే ఆ నిర్మాత తన సినిమా విషయంలో జరిగిన అంశాన్ని ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. అలాగే పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్–ఆర్ట్ డైరెక్టర్‌పై ‘తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్’ ద్వారా వివరణ తీసుకోవచ్చు. ఇలాంటివి చేయకుండా మాపై నిందలు వేయడం సరికాదు’’ అని తెలిపారు. -
కుబేర : ఆర్కిటెక్చర్ టు అసిసెంట్ ఆర్ట్ డైరెక్టర్
ఇంద్రాణి పూర్తి పేరు అక్కరాజు వెంకట నాగ ఇంద్రాణి. పుట్టింది గుంటూరు సిటీ మధ్యతరగతి కుటుంబం. నాన్న శ్రీనివాస్ అమ్మా పద్మావతి. తండ్రి హిందీ టీచర్‌గా పనిచేస్తుండేవారు. కన్హా కాన్సెప్ట్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడే ఇంటర్ కూడా పూర్తి చేశారు. తల్లికి కర్ణాటక సంగీతం, కూచిపూడి పట్ల ఆసక్తి ఉన్నా.. కలగా మిగిలిపోయింది. ఆ కలను కూతురుగా తను నేర్చుకుని పాఠశాల స్థాయి నుండి జిల్లాస్థాయి వరకూ ప్రదర్శనలిచ్చారు. అన్న ప్రసాద్‌తోపాటు బొమ్మలు గీయటం అలవర్చుకుంది. చిన్ననాటి అభిరుచి సినిమాలవైపు నడిపించింది.. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ నుంచి ఆర్ట్ ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎదిగి వెండి తెరపై తన పేరును లిఖించుకుంటోంది.. ఓ వైపు తోట తరణి.. మరోవైపు శేఖర్ కమ్ముల దిశానిర్దేశంలో తన భవితకు బాటలు వేసుకున్నారు ఇంద్రాణి. ప్రస్తుతం ఫిలింనగర్లో ఉంటూ అనేక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమవుతున్నారు. – బంజారాహిల్స్ నగరానికి ప్రయాణం.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోసం జెఎన్ఎఫ్యులో చేరడం.. సినిమా సెట్స్ డిజైనింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో వాటిని స్టడీ చేయడం.. నెమ్మదిగా స్క్రిప్ట్ రైటింగ్ పట్ల వీకెండ్ కోర్స్ చేయడం.. చకచకా జరిగిపోయాయి. మొదల్లో సినిమాల్లోకి కుటుంబ సభ్యులు నిరాకరించినా తర్వాత ఒప్పించారు. ‘కుబేర’లో లాస్ట్ ఆర్ట్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. బిల్స్, రిఫరెన్సులు, ఫొటోషాప్ డిజైనింగ్‌లు చేశారు. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అరవింద్ ఏవి, ఈ.పి నాగేశ్వరరావు వల్ల తోట తరణి, శేఖర్ కమ్ముల మరల చేర్చుకున్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ హైదరాబాద్, ముంబయి వంటి నగరాల్లో లైవ్ లొకేషన్స్‌లో పని నేర్చుకుంటూ పోయారు. సినిమాల పట్ల ఆసక్తి.. ఇంట్లో మామయ్య నాటకాలకు దర్శకత్వం వహించడం, మరోవైపు నటిస్తుండడంతో ఎప్పుడూ సందడిగా వుండేది. తండ్రి సాయంతో హిందీ నేర్చుకుంటూ బాలీవుడ్ కథల పట్ల, సంగీతం పట్ల మక్కువ పెరిగింది. షూటింగ్ సమయాల్లో కెమెరా వెనుక జరిగే విషయాల పట్ల ఆసక్తి పెరిగేలా చేశాయి. అనంతరం మసూద సినిమాకు ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేరడం.. ఆర్ట్ డైరెక్టర్ ప్రియం క్రాంతి ప్రోత్సాహంతో డైరెక్షన్ పట్ల ఇష్టంతో కన్యాశుల్కం వెబ్ సిరీస్‌లో, హరిహర వీర మల్లు సినిమాలో డైరెక్షన్ టీంలో ఆర్ట్ పనులను సమన్వయం చేసే బాధ్యతను నిర్వహించింది. డైరెక్టర్ క్రిష్ కుటుంబ సభ్యులు సుహాసిని, రాజు మద్దతుతో, ఆర్ట్ అసిస్టెంట్ అక్బర్ సహకారంతో మెంబర్‌గా అయ్యారు. ఈ క్రమంలో స్నేహితురాలు భార్గవి, ప్రమీల, కష్ణ శశాంక్ అండగా నిలిచారు. (300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు)లెజండరీ మనుషులతో.. చిన్నప్పుడు విడుదలైన అంజలి నుంచి పొన్నియన్ సెల్వన్ వరకూ పద్మశ్రీ తోట తరణి వర్క్ ఎంతగానో ఇష్టపడడం, ఆయన నీడలో నిలబడటం ఎప్పుడూ ఆశ్చర్యపరిచే విషయమే. ఆయన స్కెచ్ వేస్తుంటే ప్రతిసారీ విస్మయానికి గురవ్వడం.. ఆర్డినరీ వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తుండడం నేర్చుకున్నా.. ఆనంద్, గోదావరి సినిమాలు చూస్తూ పెరిగా. కట్‌చేస్తే శేఖర్ కమ్ముల సెట్లో ప్రతిరోజు పేరు పెట్టి పలకరించడం ఆనందం అనిపించింది. కుబేర గొప్ప అవకాశం కల్పించింది. – ఇంద్రాణి, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ -
స్టార్ హీరో షూటింగ్లో ప్రమాదం.. ఆయన మృతి!
కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత చావు ఎప్పుడు ఎలా వస్తుందనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు చిన్న చిన్న రోగాలకు కూడా కన్నుమూస్తున్నారు. ఇప్పుడు అలానే స్టార్ హీరో సినిమా షూటింగ్ కోసం టీమ్ అంతా విదేశానికి వెళ్లింది. అక్కడ అనుకోకుండా అస్వస్థతకు గురైన ఆర్ట్ డైరెక్టర్ మృతి చెందాడు. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో లిప్‌లాక్.. నాని ఇంట్లో గొడవలు!) తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ 'విడా ముయూర్చి' షూటింగ్ ప్రస్తుతం అజరాబైజన్లో జరుగుతోంది. మూవీ టీమ్ అంతా షూటింగ్ బిజీలో ఉన్నారు. అయితే ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ కాస్త అస్వస్వత్థకు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్స్ చెప్పారు. ఇక తమిళంలో ఆర్ట్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మిలాన్... గతంలో అజిత్ బిల్లా, వేదాళం సినిమాలకు కూడా పనిచేశారు. తెలుగులో గోపీచంద్ 'ఆక్సిజన్' చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. అలాంటి ఈయన ఇప్పుడు అకస్మాత్తుగా ప్రాణాలు వదిలేయడం అందరినీ షాక్‌కి గురిచేసింది. (ఇదీ చదవండి: IND Vs Pak మ్యాచ్: గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ) -
ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య.. పోలీసులు చెప్పింది ఇదే!
అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్(57) బుధవారం అకస్మాత్తుగా చనిపోయారు. రాయగడ కర్జాన్ లోని తన స్టూడియోలో విగతజీవిగా కనిపించారు. ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్దారించిన పోలీసులు.. దర్యాప్తు చేశారు. అయితే ఎన్నో అద్భుతమైన సినిమాలకు పనిచేసిన నితిన్ దేశాయ్ ఇలా చనిపోవడానికి కారణమేంటి? ఫైనల్‌గా పోలీసులు ఏం తేల్చారు. బుధవారం తెల్లవారుజామున నితిన్ దేశాయ్ చనిపోయారు. ఉదయం ఈ విషయం బయటపడింది ఈయనకు సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్ వెబ్‌సైట్స్‌లో వచ్చిన కథనాల ప్రకారం కొన్ని కంపెనీల నుంచి లోన్ తీసుకున్నాడు. (ఇదీ చదవండి: సీనియర్ నటుడు మృతి.. రోడ్డు పక్కన శవమై కనిపించి!) అలా నితిన్ తీసుకున్న రూ. 180 కోట్ల లోన్ కాస్త వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరింది. దీంత సదరు సంస్థ నితిన్ ఎన్డీ స్టూడియోని సీజ్ చేసేందుకు రెడీ అయిపోయింది. దీంతో ఈ మొత్తాన్ని కట్టలేక సతమతమయ్యాడు. చివరకు తనువు చాలించాడు. ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈయనది ఆత్మహత్యగా తేల్చారు. ఉరివేసుకుని ప్రాణం వదిలేశాడని ఎస్పీ చెప్పుకొచ్చారు. అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్ సినిమాలతో నాలుగుసార్లు జాతీయ అవార్డ్స్ సాధించిన నితిన్ ఇలా సడన్‌గా చనిపోవడంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్ రూపొందించిన ఘనత ఈయన సొంతం. లగాన్, జోధా అక్బర్, మున్నాభాయ్ M.B.B.S., లగే రహో మున్నా భాయ్ నితిన్ పనిచేసిన బాలీవుడ్ సినిమాలు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) -
నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!
Bollywood Art Director Nitin Desai: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (57) అకాల మరణం అటు పలువురి ప్రముఖులను ఇటు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుమానాస్పద మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ. బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆయన మరణానికి సంబంధించి కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు విని పిస్తున్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, కర్జాత్‌లోని ఎన్డీ స్టూడియోలోని అతని గదిలో నితిన్ దేశాయ్ మృతదేహం లభ్యమైంది. క్లీనింగ్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. ఈ విషయాన్ని గమనించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కర్జాత్, ఖలాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే స్పష్టం చేశారు. నివేదికల ప్రకారం నితిన్ దేశాయ్ కొన్ని ఆర్థిక సంస్థల నుండి ఫిక్స్డ్ టర్మ్ లోన్ తీసుకున్నాడు.అదే అతని జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసి, చివరికి మరణానికి దారి తీసింది. రూ. 180 కోట్ల రుణం వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరింది. దీనికి సంబంధించి సదరుసంస్థ ఎన్డీ స్టూడియోసీజ్కు సిద్ధమౌతోంది. కలీనాకు చెందిన ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రాయగడ కలెక్టరేట్‌కు దరఖాస్తు చేసింది. కానీ జప్తు చర్యలకు కలెక్టర్ కార్యాలయం తుది అనుమతి ఇవ్వలేదు. ఎన్డి స్టూడియో సీజ్‌కు సంబంధించిన దరఖాస్తు తన కార్యాలయానికి అందిందని రాయగడ రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ సందేశ్ షిర్కే ధృవీకరించారు. కానీ జూలై 25న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించింది. మార్చి 31, 2021న ఖాతాని నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా వర్గీకరించారని, జూన్ 30, 2022 నాటికి మొత్తం డిఫాల్ట్ మొత్తం రూ.252.48 కోట్లుగా తేలింది. (ఒప్పో కొత్త ఫోన్, ప్రారంభ ఆఫర్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?) నితిన్ దేశాయ్ వల్ల సీఎఫ్ఎం అనే ఆర్థిక సంస్థ నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకున్నారు. 2 సంవత్సరాల 2016, 2018లో ఒప్పందం ప్రకారం దీని కోసం దేశాయ్ 40 ఎకరాల భూమి,ఇంకా 3 వేర్వేరు ఆస్తులను తనఖా పెట్టాడు. అనుకోని కారణాల వల్ల 2020నుంచి రుణం తిరిగి చెల్లించలేకపోయాడు. కొంత సమయం తర్వాత CFM తన రుణ ఖాతాలన్నింటినీ ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి కేటాయించింది. అయితే అప్పుడు కూడా రుణం రికవరీ కాలేదు. దీంతో దీంతో దేశాయ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ విషయమై కొద్దిరోజుల క్రితం ఖలాపూర్ ఎమ్మెల్యే మహేష్ బల్దితో కూడా చర్చించినట్టు సమాచారం. VIDEO | "He was a good friend of mine. I met him 10-15 days ago, but didn't feel that he was in any kind of tension," says Shiv Sena (UBT) leader Baban Dada Patil on film art director Nitin Desai's suicide. pic.twitter.com/uBBG8Q0cSX — Press Trust of India (@PTI_News) August 2, 2023 #WATCH | Maharashtra: Forensic team arrived at ND Studios in Karjat, Raigad district, where the body of art director Nitin Desai was found hanging. pic.twitter.com/lEgENNCRjy — ANI (@ANI) August 2, 2023 ఎమ్మెల్యే మహేష్ బల్ది ఏమన్నారు? ఆర్థిక ఇబ్బందుల వల్లే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కర్జాత్ ఎమ్మెల్యే మహేశ్ బల్ది తెలిపారు. ఆయన మాట్లాడుతూ- నితిన్ దేశాయ్ తన నియోజకవర్గానికి నిత్యం వచ్చేవారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉదయం ఎన్డీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా? ) నితిన్ కుడిభుజం కాకా ఎన్డీ స్టూడియోస్‌ను నడిపిన నితిన్ కుడిచేతిగా భావించే కాకా కూడా ఆర్థిక ఇబ్బందులగురించి మాట్లాడారు. కానీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు ప్రేరణగా నిలిచేవ్యక్తి ఆయన. కొన్ని ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.ఇంతలోనే ఇలా జరగడం విషాదకరమన్నారు. నితిన్ దేశాయ్ మరణంతో అక్షయ్ కుమార్, మేకర్స్ అప్‌కమింగ్ మూవీ OMG 2 ఆన్లైన్ ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేశారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) Unbelievably sad to know about the demise of Nitin Desai. He was a stalwart in production design and such a big part of our cinema fraternity. He worked on so many of my films… this is a huge loss. Out of respect, we are not releasing the OMG 2 trailer today. Will launch it… — Akshay Kumar (@akshaykumar) August 2, 2023 నాలుగు జాతీయ అవార్డులు, అద్భుతమైన సినిమాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్ , దేవదాస్ మూవీలకు నాలుగు సార్లు జాతీయ అవార్డులను సాధించిన నితిన్ జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంపై పలువురు నటులు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్లను కూడా రూపొందించిన ఘనత ఆయన సొంతం. లగాన్, జోధా అక్బర్, మున్నాభాయ్ M.B.B.S., లగే రహో మున్నా భాయ్ అతను పనిచేసిన కొన్ని ప్రముఖ బాలీవుడ్ సినిమాలు . Shocking news this morning - Art Director Nitin Desai is no more. Such a warm human being, associated with many of my projects and ballets, his passing is a terrible loss to the film industry. May he find peace wherever he is🙏 pic.twitter.com/STNsz6Kwr8 — Hema Malini (@dreamgirlhema) August 2, 2023 -
విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి!
ఇండస్ట్రీలో మరో విషాదం. ఓవైపు గుండెపోటు, మరోవైపు అనారోగ్య సమస్యలతో పలువురు సీనియర్ యాక్టర్స్ చనిపోతున్నారు. అటు సినీ ప్రముఖులు, ఇటు ప్రేక్షకులు బాధపడ్డారు. సరే వీటి గురించి మెల్లమెల్లగా మర్చిపోతున్నాం అనుకునేలోపు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అనుమానాస్పద రీతిలో చనిపోవడం సంచలనంగా మారింది. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) గత కొన్ని దశాబ్దాల నుంచి బాలీవుడ్లో ఆర్ట్ డైరెక్టర్‌గా నితిన్ చంద్రకాంత్ దేశాయ్(58) గుర్తింపు తెచ్చుకున్నారు. సలాం బాంబే, 1942 ఏ లవ్ స్టోరీ, కామసూత్ర, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, స్వేడ్స్, స్లమ్ డాగ్ మిలియనీర్, జోధా అక్బర్.. ఇలా ఎన్నో సినిమాల్లోని సెట్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గానే కాకుండా మరాఠీలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన, కొన్నిచిత్రాల్లో అతిథిగా మెరిసిన ఈయన.. ముంబయి ఊరిచివర్లో ఎన్డీ స్టూడియోస్‌ని సొంతంగా పెట్టుకున్నారు. ఇప్పుడు అందులోనే అనుమానాస్పద రీతిలో శవమై కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తనుకు తానుగా చనిపోయారా లేదా వేరే ఏమైనా కోణం ఉందా అనే విషయాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏదేమైనా మంచి ఆర్ట్ డైరెక్టర్ ఇలా తనువు చాలించడంతో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!) -
వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న 'మసూద' ఆర్ట్ డైరెక్టర్
తక్కువ కాలంలోనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, కలర్ ఫోటో, మసూద ఇలాంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ 'ఆర్ట్ డైరెక్టర్' గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ‘వై క్రాంతి కుమార్ రెడ్డి’. అనంతపురం జిల్లా శెట్టూరు గ్రామానికి చెందిన క్రాంతి స్వస్థలం. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దుల్లో కావడంతో కన్నడ భాష కూడా వచ్చింది. ఇంట్లో టీవీ లేకపోవడం, రేడియోలో సినిమా స్టోరీలు, పాటలు వినడంతో సినిమాలపై ఫ్యాషన్ పెంచుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మూడు డిప్లొమాలు, పీజీ (థియేటర్) పూర్తి చేశారు క్రాంతి కుమార్. హైదరాబాద్‌లో అనేక లఘు చిత్రాలకు పనిచేశారు. నాటకాల కోసం సెట్లను రూపొందించాడు. అతని ప్రతిభ చూసి ‘రజాకార్’ 2014-15లో ఉత్తమ సెట్ డిజైనర్‌గా ‘నంది అవార్డు’ను గెలుచుకున్నాడు. నంది అవార్డుతో మొదలైన గెలుపు క్రాంతి కుమార్‌కు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం వచ్చింది. అలాగే, మసూద చిత్రానికి ఇంటర్వెల్ సన్నివేశంలో ‘డంప్ యార్డ్’ సెట్‌తో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు. క్రాంతి కుమార్ నిరంతరం నేర్చుకోవడం మరియు ఎప్పటికప్పుడు కొత్తదనం వాటి మీద దృష్టి పెట్టడం అతని కెరీర్‌కి విజయం సాధించారు. తన సక్సెస్ పట్ల క్రాంతికుమార్ మాట్లాడూతూ..' సినిమాలో రాణించాలి అంటే ప్రతిభ ఉంటే సరిపోదు. ఓపిక కుడా ఉండాలి. నేను చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం అది నా అదృష్టంగా భావిస్తా. ఈ విజయాలన్నింటికీ నా తమ్ముడు, భార్య ప్రధాన కారణం. ' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం 'పేక మేడలు', 'బహిష్కరణ' జీ 5 (సిరీస్) రెండు ప్రాజెక్ట్‌లను శరవేగంగా పూర్తి చేశారు. అంతేకాదు, రవితేజ బ్యానర్లో విశ్వక్ సేన్ హీరోగా సినిమా, కొత్తవాళ్లతో కర్నూలు సినిమా బ్యాక్‌డ్రాప్‌లో రానున్నాయి. క్రాంతి కుమార్ వరుస అవకాశాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. -
గోదావరిఖని రిఫరెన్స్‌తో.. 22 ఎకరాల్లో పల్లెటూరు సెట్
‘‘దసరా’ కథకు తగ్గట్టు భారీ విలేజ్ సెట్ వేశాం. ఇల్లు, స్కూల్, మైదానం, బార్.. ఇలా ఐదు వందల మంది నివసించే పల్లెటూరుని సహజంగా సృష్టించాం. 98 శాతం షూటింగ్ ఈ సెట్లోనే జరిగింది’’ అని ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల అన్నారు. నాని హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ– ‘‘నానీ గారితో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెర్సీ, శ్యామ్ సింగరాయ్’ సినిమాలు చేశాను. నాకు పేరు వచ్చే కంటెంట్ ఉన్న సినిమాలు నానిగారి వల్లే వచ్చాయి. ఆయన గత సినిమాలతో పోల్చితే ‘దసరా’ చాలా డిఫరెంట్ మూవీ. సంస్కృతి పరంగా 25 ఏళ్ల క్రితం నాటి ఊరు ఇందులో కనిపిస్తుంది. ఈ సెట్ కోసం గోదావరిఖని రిఫరెన్స్ తీసుకున్నా. దాదాపు 22 ఎకరాల్లో రెండున్నర నెలలు 800 మందికిపైగా పనిచేసి సెట్ వేశాం. శ్రీకాంత్ ఓదెలకి తొలి సినిమా అయినా అన్ని విషయాలపై చాలా క్లారిటీ ఉంది. ప్రస్తుతం శంకర్– రామ్ చరణ్‌గారి మూవీ, నానీగారి 30వ చిత్రం, అఖిల్ ‘ఏజెంట్’ సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
'వారీసు' రిలీజ్‌కు ముందే తీవ్ర విషాదం.. ఆర్ట్ డైరెక్టర్ మృతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'వారీసు'. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వారీసు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూశారు. గుండెపోటుతో కేరళలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటూనే గతరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా సీతారామం, ఎం.ఎస్ ధోనీ, గజిని, లక్ష్యం సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. సునీల్ బాబుకు భార్య, కూతురు ఆర్య సరస్వతి ఉన్నారు. అంత్యక్రియలు ఈరోజు(శుక్రవారం)జరిగే అవకాశం ఉంది. -
రవితేజకు అది చాలా నచ్చింది: ఆర్ట్ డైరెక్టర్
Art Director Sahi Suresh About Raviteja Rama Rao On Duty: ‘‘శక్తి’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారితో పని చేశాను. అప్పుడు నా ప్రతిభని గుర్తించిన అశ్వినీదత్ గారు ‘సారొచ్చారు’కి ఆర్ట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. దాదాపు 40 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా చేశాను’’ అని సాహి సురేష్ అన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా, దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా చేసిన సాహి సురేష్ మాట్లాడుతూ– ‘‘రామారావు ఆన్ డ్యూటీ’ 1995లో జరిగే రూరల్ కథ. 95 నేపథ్యాన్ని మొత్తం రీ క్రియేట్ చేశాం. రవితేజగారికి ఎమ్మార్వో ఆఫీస్ సెట్ చాలా నచ్చింది. శరత్ కొత్త దర్శకుడైనప్పటికీ చాలా క్లారిటీ ఉంది. ‘కంచె, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, అ’ చిత్రాలు ఆర్ట్ పరంగా నాకు చాలా తృప్తినిచ్చాయి. ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో పాటు నితిన్–వక్కంతం వంశీ సినిమాలు చేస్తున్నాను’’ అని తెలిపారు. చదవండి: నా మైండ్ సెట్ చాలా మారింది: నాగ చైతన్య కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్ డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ.. 27 ఏళ్ల తర్వాత పూర్తి పాత్రల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ !.. ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు -
'పుష్ప' మూవీ కోసం 25 సెట్స్ వేశాం: ఆర్ట్ డైరెక్టర్స్
Pushpa Art Director Rama Krishna Reveals Secrets Of Pusha Sets: ‘‘ఎర్రచందనం నేపథ్యంలో సాగే ‘పుష్ప’ సినిమా కోసం కృత్రిమంగా అడవిని సృష్టించడం చాలా కష్టంగా అనిపించింది. ప్రేక్షకులకు సెట్ అనే భావన రాకుండా ఒరిజినల్ ఫీలింగ్ కలిగించేలా సెట్స్ వేయడం సవాల్‌గా నిలిచింది’’ అని ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ–మౌనిక అన్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మొదటి భాగం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘పుష్ప’కి ఆర్ట్ డైరెక్టర్స్‌గా చేసిన రామకృష్ణ–మౌనిక విలేకరులతో మాట్లాడుతూ– ‘‘రంగస్థలం’ తర్వాత సుకుమార్‌గారితో ‘పుష్ప’కి పని చేశాం. ఆయనతో ఒక్కసారి కనెక్ట్ అయితే మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు మంచి విలువ ఇస్తారు. ‘పుష్ప’ సినిమా కోసం మొత్తం 25 సెట్స్ వేశాం. నిర్మాతల తపన, ధైర్యం వల్లే సెట్స్ గ్రాండ్‌గా వేయగలిగాం. అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ వల్ల కేరళలోని ఓ జలపాతం వద్ద షూటింగ్ చేయడానికి వీలు కాలేదు.. దీంతో ఆ జలపాతం సెట్‌ని కూడా హైదరాబాద్‌లోనే వేశాం. సెట్స్‌లోకి అడుగుపెట్టగానే బన్నీగారు (అల్లు అర్జున్) సెట్స్ బాగున్నాయని అభినందించారు. కొన్ని సన్నివేశాలు అడవుల్లో, మరికొన్ని సెట్స్‌లో తీసినా ఏది నిజమైన అడవో? ఏది సెట్టో అనేది ప్రేక్షకులకు తేడా తెలియకూడదని కష్టపడ్డాం. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చేస్తున్నాం’’ అన్నారు. -
క్యాన్సర్‌తో ప్రముఖ సినీ కళా దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సినీ కళా దర్శకుడు అంగముత్తు షణ్ముఖం(60) క్యాన్సర్‌తో ఆదివారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఈయన స్థానిక నుంగంబాక్కంలోని కుమారప్ప మొదలి వీధిలో నివసిస్తున్నారు. 40 ఏళ్లుగా సినీ కళామతల్లికి విశేష సేవలు అందించారు. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోల చిత్రాలకు పని చేశారు. ఈయన సినీ కళా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు మూడుసార్లు కార్యదర్శిగా పనిచేశారు. అంగముత్తు షణ్ముఖం మృతికి తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు, దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి తదితరులు సంతాపం తెలిపారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం ఉదయం స్థానిక నుంగంబాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: ఆ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్‌ను మర్చిపోవడం కష్టం, ఎందుకంటే? -
ప్రముఖ చిత్రకారుడు చంద్ర ఇకలేరు
ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్ డైరెక్టర్ చంద్ర(74) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన..సికింద్రాబాద్ మదర్ థెరిసా రీహబిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.వరంగల్ జిల్లాకు చెందిన రంగయ్య, సోమలక్ష్మీ దంపతులకు చంద్రశేఖర్ ఆగస్ట్ 28, 1946లో జన్మించారు. సర్వశ్రీ శేషగిరిరావు, బాపు, సత్యమూర్తి స్ఫూర్తితో ఆయన చిత్రలేఖనం వైపు అడుగులు వేశారు. యుక్తవయసు నుండే రేఖా చిత్రాలు గీయడం ప్రారంభించారు. బాపు తర్వాత ఆ స్థాయిలో విరివిగా వార, మాస పత్రికలకు బొమ్మలు గీసిన ఖ్యాతి చంద్రకే దక్కుతుంది. నాలుగు దశాబ్దాల పాటు నలుపు తెలుపులో ఇలస్ట్రేషన్స్, రంగుల్లో బొమ్మలు, కార్లూన్లు, పెయింటింగ్స్, గ్రీటింగ్ కార్డులు, లోగోలు గీసిన చంద్రకు దేశ విదేశాలలో కోట్లాది మంది అభిమానులు వున్నారు. వేల సంఖ్యలో నవలలకు కవర్ పేజీలు వేశారు. దశాబ్దాల పాటు వార ప్రతికలకు పండగ సమయాల్లో కవర్ పేజీలు గీశారు. చంద్రకు భార్య భార్గవితో పాటు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. చంద్ర మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
అందమైన చిత్రాలు వేస్తారు.. నలుగురికి నేర్పిస్తారు
-
ఆర్ట్ డైరెక్టర్
-
రంగస్థలం టూ అంతరిక్షం
ఒక చిత్రంలో అన్ని అంశాలు సమపాలల్లో ఉండి ప్రేక్షకులు కనెక్ట్ అయితే చాలూ దాని ఫలితం బ్లాక్ బస్టరే. రంగస్థలం చిత్రం విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. సుకుమార్ టేకింగ్.. చెర్రీ అండ్ మిగతా తారాగణం నటన.. టెక్నీషియన్ల సమిష్టి కృషి.. వెరసి రంగస్థలాన్ని వంద కోట్ల క్లబ్‌లోకి చేర్చేసింది. ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్లకు మంచి అవకాశాలను అందిస్తోంది. రామకృష్ణ-మౌనిక.. రంగస్థలం కోసం పని చేసిన ఆర్ట్ డైరెక్టర్లు. ముఖ్యంగా వీళ్లు రూపొందించిన విలేజ్ సెటప్‌కు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో వీళ్ల టాలెంట్‌కు మరో అవకాశం దక్కింది. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించబోయే స్పేస్ థ్రిల్లర్ చిత్రానికి రామకృష్ణ-మౌనికలను ఎంపిక చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఇప్పుడు శాటిలైట్లు.. అంతరిక్షం సెట్ల డిజైన్ల రూపకల్పనలో బిజీగా ఉన్నారు. అంతేకాదు త్వరలో నాసాను సందర్శించి. అక్కడి విషయాలను కూడా వీళ్లు పరిశీలిస్తారంట. తెలుగులో ఫస్ట్ టైమ్ స్పేస్ జోనర్లో వస్తున్న చిత్రం కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
'బాహుబలి-2' సామ్రాజ్యాన్ని చూశారా?
'బాహుబలి' సినిమాను వెండితెర దృశ్యకావ్యంగా మలిచి.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాడు దర్శకుడు రాజమౌళి. భారీ బడ్జెట్‌తో, భారీ అట్టహాసంతో తెరకెక్కిన 'బాహుబలి' మహత్తరమైన విజయాన్ని సాధించడంతో 'బాహుబలి-2'పై సర్వత్రా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం 'బాహుబలి-2' ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'బాహుబలి' సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాబు సిరిల్ రెండోపార్టు కోసం భారీ సెట్టింగ్స్ సిద్ధం చేస్తున్నాడు. మొదటి పార్టులో కనిపించిన 'బాహుబలి' రాజ్యవైభవాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. 'బాహుబలి' 1, 2 పార్టుల కోసం సృష్టికి ప్రతిసృష్టి చేసి రూపొందిస్తున్న మాహిష్మతి సామ్రాజ్యం గురించి ఆయన వివరించారు. 'నిస్సందేహంగా బహుబలి నా కెరీర్లోనే అతిపెద్ద సినిమా. దీని కోసం ఒకేసారి పది సినిమాలకు పనిచేసినట్టు ఉంది. చారిత్రక కథ, యుద్ధనేపథ్యం, భారీ పాత్రలు, సెట్టింగ్స్, యోధులు, అడవులు, జంతువులు, రాజరిక వైభవం ఇలా చాలా విషయాల్లో నాకు చాలెంజింగ్ మూవీ. కానీ ఈ చాలెంజ్‌ను ఆస్వాదిస్తున్నా. 'బాహుబలి' రెండుపార్టులకు పనిచేయడం పదేళ్లకు సరిపడా జ్ఞానాన్ని అనుభవాన్ని ఇచ్చింది' అని శిబు సిరిల్ చెప్పారు. 'బాహుబలి' సినిమా కోసం ఆయన ప్రతిష్టాత్మకమైన శంకర్ 'రోబో-2' ప్రాజెక్టు ఆఫర్‌ను కూడా వదులుకున్నారు. 'బాహుబలి-2' కోసం ఆయన సిద్ధం చేసిన సెట్టింగ్స్ స్టిల్స్‌ను 'ఐఫ్లిక్జ్.కామ్' ప్రచురించింది. 'బాహుబలి-2' సెట్స్ కోసం దాదాపు 300 నుంచి 500 మంది పనిచేస్తున్నారు. పెయింటర్లు మొదలు కార్పెంటర్లు, వెల్డర్లు, భవన నిర్మాణ కార్మికులు, కళాకారులు ఇలా చాలామంది ఈ సినిమా కోసం కష్టపడుతూ అత్యద్భుతమైన సెట్లను తీర్చిదిద్దుతున్నారు. -
కళ్లు చెదిరే సెట్టింగ్‌లతో... ఆర్ట్ డైరెక్టర్
అప్‌కమింగ్ కెరీర్: ‘ఒక్కడు’ సినిమాలో చార్మినార్‌ను చూసి ఆశ్చర్యపోనివారు ఉండరు. పాతబస్తీలోని నిజమైన చార్మినార్‌ను తలపించేలా దాన్ని కృత్రిమంగా నిర్మించారు. ఆ క్రెడిటంతా ఆర్ట్ డెరైక్టర్కే దక్కుతుంది. అలాగే మగధీర, యమదొంగ వంటి సినిమాల్లోని సెట్టింగ్‌లు ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లాయి, తమ సృజనాత్మకతతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఆర్ట్ డెరైక్టర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. చేతినిండా పని: సినిమాలు, టీవీ కార్యక్రమాలు, యాడ్ ఫిల్మ్‌ల చిత్రీకరణకు, రంగ స్థలంపై నాటకాలకు సందర్భానికి తగిన సెట్టింగ్‌లు వేయడం తప్పనిసరి. వీటివల్లే దృశ్యానికి నిండుతనం వస్తుంది. వీక్షకులను మెప్పిస్తుం ది. సినిమాల చిత్రీకరణతోపాటు టీవీ ఛానళ్ల సంఖ్య పెరగడంతో ఆర్ట్ డెరైక్టర్లకు చేతినిండా పని దొరుకుతోంది. స్డూడియోల్లో వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. నైపుణ్యాలు పెంచుకోవాలి: ఆర్ట్ డెరైక్టర్‌గా వృత్తిలో పైకి ఎదగాలంటే ప్రధానంగా శ్రమకు వెనుకాడని లక్షణం ఉండాలి. విసృ్తతంగా చదివే అలవాటుతో ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. పరిశీలనా శక్తి అవసరం. ఎప్పటికప్పుడు టైమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, ప్లానింగ్, నెట్వర్కింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలు ఉన్నప్పటికీ మంచి పనితీరుతో గుర్తింపును తెచ్చుకుంటే అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. ఆర్ట్ డెరైక్షన్ కోర్సు పూర్తిచేసిన తర్వాత మొదట సీనియర్ డెరైక్టర్ వద్ద సహాయకుడిగా పనిచేసి వృత్తిలో అనుభవం సంపాదించాలి. తర్వాత సొంతంగా ప్రాజెక్ట్‌లు చేపట్టవచ్చు. అర్హతలు: ఫైన్ ఆర్ట్స్‌లో భాగంగా ఆర్ట్ డెరైక్షన్ కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీయెట్ పూర్తయిన తర్వాత ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయొచ్చు. ఇంటీరియర్ డిజైన్, ఆర్కిటెక్చర్ విభాగాల్లోనూ నైపుణ్యం, తగిన అనుభవం సంపాదించినవారు ఆర్ట్ డెరైక్షన్లోకి ప్రవేశించొచ్చు. వేతనాలు: అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌కు ప్రారంభంలో నెలకు రూ.7 వేల వేతనం ఉంటుంది. తర్వాత హోదాను బట్టి పెరుగుతుంది. కనీసం మూడేళ్లపాటు పనిచేసి, నైపుణ్యాలు పెంచుకుంటే నెలకు రూ.30 వేలకు పైగానే సంపాదించుకోవచ్చు. సొంత ప్రాజెక్టులతో రూ.లక్షల్లో ఆర్జించవచ్చు. ఆర్ట్ డెరైక్షన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణె వెబ్సైట్: www.ftiindia.com ఆసియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టీవీ వెబ్సైట్: www.aaft.com బనారస్ హిందూ యూనివర్సిటీ; వెబ్సైట్: www.bhu.ac.in మహారాజా శాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా వెబ్సైట్: www.msubaroda.ac.in సృజనాత్మకత ఉండాలి! శ్రీసినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలతోపాటు అడ్వర్టైజ్మెంట్ చిత్రీకరణకు సెట్స్ నిర్మాణం తప్పనిసరి అవుతోంది. ఈ నేప థ్యంలో చిత్ర రంగంలో ఆర్ట్ డెరైక్టర్స్‌కు మంచి అవకాశా లున్నాయి. ఒక్కో సెట్‌కు దీర్ఘకాలం పాటు కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఓర్పు, సహనం, కష్టపడే తత్వం ఉండాలి. ఉదాహరణకు ‘ఒక్కడు’ సినిమా సెట్ వేయడానికి 300 మంది మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. దానికి ప్రతిఫలంగానే సెట్‌కు మంచి గుర్తింపు లభించింది. ఈ రంగంలో డిమాండ్‌ను బట్టి వేతనాలు/పారితోషకాలు లభిస్తాయి. పరిశ్రమలో రూ. 30 వేలు తీసుకునేవారితోపాటు రూ. 40లక్షలు పారితోషకం పొందేవారూ ఉన్నారు.్ణ - కె. అశోక్ కుమార్, ప్రముఖ సినీ ఆర్ట్ డెరైక్టర్ .