వరుస ఆఫర్లు కొట్టేస్తున్న 'మసూద' ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి కుమార్

Masooda Art Director Kranthi Kumar Success Story - Sakshi

తక్కువ కాలంలోనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, కలర్ ఫోటో, మసూద ఇలాంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ 'ఆర్ట్ డైరెక్టర్' గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ‘వై క్రాంతి కుమార్ రెడ్డి’. అనంతపురం జిల్లా శెట్టూరు గ్రామానికి చెందిన క్రాంతి స్వస్థలం. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దుల్లో కావడంతో కన్నడ భాష కూడా వచ్చింది. ఇంట్లో టీవీ లేకపోవడం, రేడియోలో సినిమా స్టోరీలు, పాటలు వినడంతో సినిమాలపై ఫ్యాషన్ పెంచుకున్నారు.  తెలుగు విశ్వవిద్యాలయంలో మూడు డిప్లొమాలు, పీజీ (థియేటర్) పూర్తి చేశారు క్రాంతి కుమార్. హైదరాబాద్‌లో అనేక లఘు చిత్రాలకు పనిచేశారు. నాటకాల కోసం సెట్‌లను రూపొందించాడు. అతని ప్రతిభ చూసి ‘రజాకార్’ 2014-15లో ఉత్తమ సెట్ డిజైనర్‌గా ‘నంది అవార్డు’ను గెలుచుకున్నాడు.

నంది అవార్డుతో మొదలైన గెలుపు క్రాంతి కుమార్‌కు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం వచ్చింది. అలాగే, మసూద చిత్రానికి ఇంటర్వెల్ సన్నివేశంలో ‘డంప్ యార్డ్’ సెట్‌తో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు. క్రాంతి కుమార్ నిరంతరం నేర్చుకోవడం మరియు ఎప్పటికప్పుడు కొత్తదనం వాటి మీద దృష్టి పెట్టడం అతని కెరీర్‌కి విజయం సాధించారు.

తన సక్సెస్ పట్ల క్రాంతికుమార్ మాట్లాడూతూ..' సినిమాలో రాణించాలి అంటే ప్రతిభ ఉంటే సరిపోదు. ఓపిక కుడా ఉండాలి. నేను చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం అది నా అదృష్టంగా భావిస్తా. ఈ విజయాలన్నింటికీ నా తమ్ముడు, భార్య ప్రధాన కారణం. ' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం 'పేక మేడలు', 'బహిష్కరణ' జీ 5 (సిరీస్) రెండు ప్రాజెక్ట్‌లను శరవేగంగా పూర్తి చేశారు. అంతేకాదు, రవితేజ బ్యానర్‌లో విశ్వక్ సేన్ హీరోగా సినిమా,  కొత్తవాళ్లతో కర్నూలు సినిమా బ్యాక్‌డ్రాప్‌లో రానున్నాయి. క్రాంతి కుమార్ వరుస అవకాశాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top