కుబేర : ఆర్కిటెక్చర్‌ టు అసిసెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ | Assistant art director Indrani success story with sakshi | Sakshi
Sakshi News home page

కుబేర : ఆర్కిటెక్చర్‌ టు అసిసెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌

Jul 8 2025 10:19 AM | Updated on Jul 8 2025 10:41 AM

Assistant art director Indrani success story with sakshi

అన్న ప్రసాద్‌ స్ఫూర్తితో ఆర్ట్‌ రంగంలోకి అమ్మా, నాన్నల సహకారంతోనే 

‘కుబేర’కు వర్క్‌ చేయడం మర్చిపోలేను.. సాక్షితో అసిస్టెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఇంద్రాణి 

ఇంద్రాణి పూర్తి పేరు అక్కరాజు వెంకట నాగ ఇంద్రాణి. పుట్టింది గుంటూరు సిటీ మధ్యతరగతి కుటుంబం. నాన్న శ్రీనివాస్‌ అమ్మా పద్మావతి. తండ్రి హిందీ టీచర్‌గా పనిచేస్తుండేవారు. కన్హా కాన్సెప్ట్‌ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడే ఇంటర్‌ కూడా పూర్తి చేశారు. తల్లికి కర్ణాటక సంగీతం, కూచిపూడి పట్ల ఆసక్తి ఉన్నా.. కలగా మిగిలిపోయింది. ఆ కలను కూతురుగా తను నేర్చుకుని పాఠశాల స్థాయి నుండి జిల్లాస్థాయి వరకూ ప్రదర్శనలిచ్చారు. అన్న ప్రసాద్‌తోపాటు బొమ్మలు గీయటం అలవర్చుకుంది. 

చిన్ననాటి అభిరుచి సినిమాలవైపు నడిపించింది.. ఆర్కిటెక్చర్‌ స్టూడెంట్‌ నుంచి ఆర్ట్‌ ఆసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎదిగి వెండి తెరపై తన పేరును లిఖించుకుంటోంది.. ఓ వైపు తోట తరణి.. మరోవైపు శేఖర్‌ కమ్ముల దిశానిర్దేశంలో తన భవితకు బాటలు వేసుకున్నారు ఇంద్రాణి. ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఉంటూ అనేక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమవుతున్నారు. – బంజారాహిల్స్‌ 

నగరానికి ప్రయాణం..  
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోసం జెఎన్‌ఎఫ్‌యులో చేరడం.. సినిమా సెట్స్‌ డిజైనింగ్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధతో వాటిని స్టడీ చేయడం.. నెమ్మదిగా స్క్రిప్ట్‌ రైటింగ్‌ పట్ల వీకెండ్‌ కోర్స్‌ చేయడం.. చకచకా జరిగిపోయాయి. మొదల్లో సినిమాల్లోకి కుటుంబ సభ్యులు నిరాకరించినా తర్వాత ఒప్పించారు. ‘కుబేర’లో లాస్ట్‌ ఆర్ట్‌ అసిస్టెంట్‌గా జాయిన్‌ అయ్యారు. బిల్స్, రిఫరెన్సులు, ఫొటోషాప్‌ డిజైనింగ్‌లు చేశారు. చీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ అరవింద్‌ ఏవి, ఈ.పి నాగేశ్వరరావు వల్ల తోట తరణి, శేఖర్‌ కమ్ముల మరల చేర్చుకున్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ హైదరాబాద్, ముంబయి వంటి నగరాల్లో లైవ్‌ లొకేషన్స్‌లో పని నేర్చుకుంటూ పోయారు.  

సినిమాల పట్ల ఆసక్తి.. 
ఇంట్లో మామయ్య నాటకాలకు దర్శకత్వం వహించడం, మరోవైపు నటిస్తుండడంతో ఎప్పుడూ సందడిగా వుండేది. తండ్రి సాయంతో హిందీ నేర్చుకుంటూ బాలీవుడ్‌ కథల పట్ల, సంగీతం పట్ల మక్కువ పెరిగింది. షూటింగ్‌ సమయాల్లో కెమెరా వెనుక జరిగే విషయాల పట్ల ఆసక్తి పెరిగేలా చేశాయి. అనంతరం మసూద సినిమాకు ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరడం.. ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రియం క్రాంతి ప్రోత్సాహంతో డైరెక్షన్‌ పట్ల ఇష్టంతో కన్యాశుల్కం వెబ్‌ సిరీస్‌లో, హరిహర వీర మల్లు సినిమాలో డైరెక్షన్‌ టీంలో ఆర్ట్‌ పనులను సమన్వయం చేసే బాధ్యతను నిర్వహించింది. డైరెక్టర్‌ క్రిష్‌ కుటుంబ సభ్యులు సుహాసిని, రాజు మద్దతుతో, ఆర్ట్‌ అసిస్టెంట్‌ అక్బర్‌ సహకారంతో మెంబర్‌గా అయ్యారు. ఈ క్రమంలో స్నేహితురాలు భార్గవి, ప్రమీల, కష్ణ శశాంక్‌ అండగా నిలిచారు.  (300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు)

లెజండరీ మనుషులతో.. 
చిన్నప్పుడు విడుదలైన అంజలి నుంచి పొన్నియన్‌ సెల్వన్‌ వరకూ పద్మశ్రీ తోట తరణి వర్క్‌ ఎంతగానో ఇష్టపడడం, ఆయన నీడలో నిలబడటం ఎప్పుడూ ఆశ్చర్యపరిచే విషయమే. ఆయన స్కెచ్‌ వేస్తుంటే ప్రతిసారీ విస్మయానికి గురవ్వడం.. ఆర్డినరీ వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తుండడం నేర్చుకున్నా.. ఆనంద్, గోదావరి సినిమాలు చూస్తూ పెరిగా. కట్‌చేస్తే శేఖర్‌ కమ్ముల సెట్‌లో ప్రతిరోజు పేరు పెట్టి పలకరించడం ఆనందం అనిపించింది. కుబేర గొప్ప అవకాశం కల్పించింది. – ఇంద్రాణి, అసిస్టెంట్‌  ఆర్ట్‌ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement