శాస్త్రరంగంలో సగర్వంగా... | International Day of Women and Girls in Science on February 11 | Sakshi
Sakshi News home page

శాస్త్రరంగంలో సగర్వంగా...

Feb 11 2026 1:38 AM | Updated on Feb 11 2026 1:38 AM

International Day of Women and Girls in Science on February 11

నేడు ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌

‘సైన్స్‌ విద్యలు మహిళల కోసం కాదు’ అన్నట్లుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితి మెల్లగా మారిపోయింది. గతంతోపోల్చితే సైన్స్‌లో మహిళల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ పురుషులతో పోల్చితే సైన్స్‌లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది...

సైన్సులో ప్రపంచ వ్యాప్తంగా మహిళా పరిశోధకులు 30 శాతం కంటే తక్కువగా ఉన్నారు

⇒  సైన్స్‌లో బాలికలు, మహిళలను ప్రోత్సహించడానికి, కెరీర్‌లో సమాన అవకాశాలు కలిగించడానికి తొమ్మిది అంతర్జాతీయ సంస్థలు ఉమ్మడిగా ప్రాజెక్ట్‌ చేపట్టాయి.

అంతరాన్ని కొలవాలి... పరిష్కారాలు ఆలోచించాలి
⇒  మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సైన్స్‌లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది.
⇒  ప్రపంచ వ్యాప్తంగా సైన్స్‌లో లింగ అంతరం లేకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జెండర్‌గ్యాప్‌ను కొలిచి, దాన్ని ఎలా తగ్గించాలనేది ఆ ప్రయత్నాలలో ఒకటి.

⇒ రాచెల్‌ ఐవీ, సుసాన్‌ వైట్‌ అనే శాస్త్రవేత్తలు సైన్స్‌లో జెండర్‌ గ్యాప్‌నకు సంబంధించి లోతైన విశ్లేషణ చేశారు. పరిష్కార మార్గాలను సూచించారు
⇒  ‘సైన్స్‌లో లింగ సమానత్వం’ (జెండర్‌ ఈక్వాలిటీ) అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట వర్చువల్‌ మీటింగ్స్‌ జరుగుతున్నాయి.

చాలా తక్కువ... శాస్త్రీయ సంస్థలలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థానాలలో మహిళలు చాలా తక్కువగా ఉన్నారు.
ప్రభావం... పాతుకుపోయిన కొన్ని సామాజిక విశ్వాసాలు ‘సైన్స్‌ అనేది పురుషుల రంగం’ అనుకునేలా చేశాయి.
పక్షపాతం... సైన్స్‌ ఫీల్డ్‌లో ఉద్యోగ నియామకాలు, నిధులు, కెరీర్‌ పురోగతికి సంబంధించి మహిళల పట్ల వివక్ష కనిపిస్తుంది.

కాల్‌ టు యాక్షన్‌
సైన్స్‌లో మహిళకు సమాన అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో యూనెస్కో ‘కాల్‌ టు యాక్షన్‌’ప్రోగ్రామ్‌ రూపొందించింది.

రోల్‌ మోడల్‌
సైన్స్‌లో మహిళా రోల్‌మోడల్స్‌ సంఖ్య పెరగడంతో వారిని స్ఫూర్తిగా తీసుకునే ధోరణి బాలికలలో పెరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement