స్టార్ హీరో షూటింగ్‌లో ప్రమాదం.. ఆయన మృతి! | Art Director Milan Died In Shooting Ajith Vidaa Muyarchi | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీలో విషాదం.. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లి కన్నుమూత!

Oct 15 2023 4:30 PM | Updated on Oct 15 2023 4:37 PM

Art Director Milan Died In Shooting Ajith Vidaa Muyarchi - Sakshi

కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత చావు ఎప్పుడు ఎలా వస్తుందనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు చిన్న చిన్న రోగాలకు కూడా కన్నుమూస్తున్నారు. ఇప్పుడు అలానే స్టార్ హీరో సినిమా షూటింగ్ కోసం టీమ్ అంతా విదేశానికి వెళ్లింది. అక్కడ అనుకోకుండా అస్వస్థతకు గురైన ఆర్ట్ డైరెక్టర్ మృతి చెందాడు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌తో లిప్‌లాక్‌.. నాని ఇంట్లో గొడవలు!)

తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ 'విడా ముయూర్చి' షూటింగ్ ప్రస్తుతం అజరాబైజన్‌లో జరుగుతోంది. మూవీ టీమ్ అంతా షూటింగ్ బిజీలో ఉన్నారు. అయితే ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ కాస్త అస్వస్వత్థకు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్స్ చెప్పారు.

ఇక తమిళంలో ఆర్ట్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మిలాన్... గతంలో అజిత్ బిల్లా, వేదాళం సినిమాలకు కూడా పనిచేశారు. తెలుగులో గోపీచంద్ 'ఆక్సిజన్' చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. అలాంటి ఈయన ఇప్పుడు అకస్మాత్తుగా ప్రాణాలు వదిలేయడం అందరినీ షాక్‌కి గురిచేసింది.

(ఇదీ చదవండి: IND Vs Pak మ్యాచ్‌: గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న బాలీవుడ్‌ బ్యూటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement