హీరోయిన్ రష్మిక కొన్నాళ్ల క్రితం గాయపడింది. ఓ పాట షూటింగ్‌లో భాగంగా తుంటి భాగానికి గాయమవగా ఇంట్లోనే నెల పాటు విశ్రాంతి తీసుకుంది. ప్రస్తుతం తిరిగి చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే సదరు మూవీ 'మైసా' విడుదల తేదీని ప్రకటించారు. మళ్లీ అచ్చొచ్చిన నవంబరు నెలలోనే రష్మిక.. తన మూవీతో థియేటర్లలోకి రాబోతుంది.
(ఇదీ చదవండి: పెళ్లి పేరుతో మోసం.. పరారీలో 'బాసింగ బలాలే' ఈశ్వర్ సాయి)
గతేడాది నవంబరులో 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాతో సక్సెస్ అందుకున్న రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భర్తతోనే 'రణబాలి' అనే పీరియాడికల్ మూవీ చేస్తోంది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 11నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ వాయిదా పడటంతో అక్టోబరు 16న రావాలనే ఆలోచనలో ఉన్నారు.
మరోవైపు రష్మిక చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా'. రవీంద్ర పుల్లెల దర్శకుడు. పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమా నుంచి రష్మిక పవర్‌ఫుల్ లుక్ వదిలి నవంబరు 27న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు నెల గ్యాప్‌లో రష్మిక తన రెండు మూవీస్‌తో బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతుందనమాట.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)
Resilient by nature.
Fearless by choice.
Unbreakable by spirit. ❤️🔥
Get ready to experience the world of #MYSAA with #RashmikaMandanna like never before.💥
IN CINEMAS WORLDWIDE ON 27.11.26🔥@iamRashmika @RawindraPulle @jakes_bejoy @unformulafilms @TSeries @tseriessouth pic.twitter.com/ZmpAUeYGqU— UnFormula Films (@unformulafilms) September 1, 2026


