తెలుగు సీరియల్ నటి ఝాన్సీ పెళ్లి చేసుకుంది. రెండు రోజుల క్రితం ఈ శుభకార్యం జరగ్గా.. తన వివాహ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి, సీరియల్ నటి దీప్తి మాన్, శ్రీహన్ తదితరులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.
(ఇదీ చదవండి: పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు)
ఝాన్సీ విషయానికొస్తే తెలుగులో జగద్ధాత్రి, నిండుమనసులు, లక్ష‍్మీ నివాసం, చిరంజీవి లక్ష‍్మీ సౌభగ్యవతి, సూర్యకాంతం, సివంగి తదితర సీరియల్స్ లో సహాయ పాత్రలు చేసింది. గతంలో రాజ్ తరుణ్, ప్రియదర్శి చేసిన పలు చిత్రాల్లో సహాయపాత్రల్లోనూ కనిపించింది. ఎక్స్‌పోజ్డ్ అనే తెలుగు సిరీస్‌లోనూ చిన్న పాత్ర పోషించింది. ఇప్పుడు ఇషాన్ అనే రైటర్‌తో కొత్త జీవితం ప్రారంభించింది.
(ఇదీ చదవండి: పెళ్లి పేరుతో మోసం.. పరారీలో 'బాసింగ బలాలే' ఈశ్వర్ సాయి)


