బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్ | Telugu Serial Actress Chandana Shetty Blessed Baby Girl | Sakshi
Sakshi News home page

Chandana Segu: శుభవార్త చెప్పిన 'వరూధిని పరిణయం' హీరోయిన్

Aug 7 2026 10:40 AM | Updated on Aug 7 2026 10:48 AM

Telugu Serial Actress Chandana Shetty Blessed Baby Girl

తెలుగులో పదేళ్ల ‍క్రితం ప్రసారమైన 'వరూధిని పరిణయం' సీరియల్‌తో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ చందన శెట్టి శుభవార్త చెప్పింది. తనకు గత నెల 26వ తేదీన కూతురు పుట్టిందనే సంగతి దాదాపు పదిరోజుల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లడించింది. కూతురికి సంబంధించిన ఒకటి రెండు ఫొటోలని పంచుకుంది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)

స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన చందన శెట్టి.. 2013 నుంచి 2016 వరకు ప్రసారమైన 'వరూధిని పరిణయం' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత దేవయాని, పవిత్ర బంధం సీరియల్స్ కూడా చేసింది. మధ్యలో తమిళ్‌లో రెండు సీరియల్స్‌ చేసి అనంతరం మళ్లీ తెలుగులో 'స్వర్ణా ప్యాలెస్‌' చేసింది. అలానే తెలుగు, కన్నడలో పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ రాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసి 2024 ఏప్రిల్‌లో ఓ ఎన్నారైని పెళ్లి చేసుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో తన ప్రెగ్నెన్సీ సంగతి బయటపెట్టన చందన.. ఇప్పుడు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈమె అమెరికాలోని కాలిఫోర్నియాలో భర్తతో కలిసి జీవిస్తోంది. ఇకపోతే సీరియల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న చందన తల్లి సరస్వతి ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. అలా తల్లిలానే చందన తొలుత డబ్బింగ్ కెరీర్‌ని ఎంచుకుంది. 2008-12 మధ్య దాదాపు 45 సినిమాల్లో హీరోయిన్లకు గాత్ర దానం చేసింది. తర్వాతే సీరియల్స్‌లోకి వచ్చింది.

(ఇదీ చదవండి: బ్రష్ కొనివ్వలేదని కేసు.. 'పళ్లబురుసు' ట్రైలర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement