'గుండె నిండా గుడి గంటలు' అనే తెలుగు సీరియల్‌తో ప్రతిరోజు ప్రేక్షకుల్ని పలకరించే మీనా అలియాస్ అమూల్య గౌడ.. ఎట్టకేలకు శుభవార్త చెప్పేసింది. తన ప్రియుడి ఎవరో బయటపెట్టింది. తాజాగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఈమె అతడితో కలిసి ముచ్చట్లు చెబుతూ అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. పుకార్లని నిజం చేస్తూ సహనటుడితోనే ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది.
(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకోవడంపై నటి సురేఖావాణి క్లారిటీ)
మైసూరుకి చెందిన అమూల్య గౌడ.. పదకొండేళ్ల క్రితం సొంత భాష కన్నడలో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. స్వాతిముత్తు సీరియల్‌లో తొలుత నటించింది. తర్వాత నటించిన 'కమలి' సీరియల్ ఈమెకు బోలెడంత గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం పునర్ వివాహ, ఆరామనే తదితర ధారావాహికల్లో కనిపించింది.
'కార్తీకదీపం' మోడ్రన్ వెర్షన్‌లో పెద్ద శౌర్యగా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మెప్పించి 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్‌లో మీనా పాత్రలో అలరిస్తోంది. అయితే ఈమె కన్నడలో 'కమలి' సీరియల్ చేస్తున్నప్పుడే సహ నటుడు నిరంజన్‌తో ప్రేమలో పడింది. గతంలోనే వీళ్లిద్దరి బంధం గురించి రూమర్స్ వచ్చాయి. కానీ వాటపై అటు అమూల్య గానీ ఇటు నిరంజన్ గానీ స్పందించలేదు.
ఇప్పుడు ఎట్టకేలకు అమూల్యనే తన యూట్యూబ్ వీడియోతో నిరంజన్ తన ప్రియుడు అని క్లారిటీ ఇచ్చేసింది. ఇతడు కూడా కన్నడ నటుడే అయినప్పటికీ తెలుగులో ఎన్నెన్నో జన్మలబంధం, సత్యభామ సీరియల్స్‌లో హీరోగా చేశాడు. మరి ఇప్పుడు తన బంధాన్ని బయటపెట్టేశారు కాబట్టి త్వరలోనే పెళ్లి కబురు కూడా చెప్పేస్తారేమో చూడాలి?
(ఇదీ చదవండి: బన్నీ, మహేశ్‌కి పోటీ.. చరణ్-ఎన్టీఆర్ కూడా బిజినెస్‌లోకి?)


