ప్రియుడిని పరిచయం చేసిన యంగ్ హీరోయిన్ | Brigida Saga Boyfriend Name And Details | Sakshi
Sakshi News home page

Brigida Saga: తెలుగు దర్శకుడితో డేటింగ్ రూమర్స్.. ఇప్పుడేమో

Jun 30 2026 9:58 AM | Updated on Jun 30 2026 10:46 AM

Brigida Saga Boyfriend Name And Details

పవి టీచర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటి బ్రిగిడా సాగా.. సొంత భాషతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు తన ప్రేమ సంగతి బయటపెట్టింది. నటుడు ఆనంద్ రామ్‌తో రిలేషన్‌లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది.

(ఇదీ చదవండి: సీఎం విజయ్‌లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)

తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్‌గా తెగ వైరల అయిపోయిన బ్రిగిడా సాగా.. 2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్‌స్పాట్ టూ మచ్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి. తర్వాత అంతా మర్చిపోయారు.

అలాంటిది ఇప్పుడు బ్రిగిడా సాగా తన ప్రేమ విషయం రివీల్ చేసి ప్రియుడి గురించి చెప్పడంతో తోటీ నటీనటులు విషెస్ చెబుతున్నారు. ఆనంద్ రామ్.. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు.

బ్రిగిడా సాగా తన ఇన్ స్టాలో ఆనంద్ గురించి చెబుతూ.. చిన్నప్పటి నుంచి అందమైన ప్రేమకథలు సినిమాల్లో ఉంటాయని అనుకునే దాన్ని, కానీ జీవితం నాకోసం మరో అందమైన కథ రాసింది. సినిమా ప్రయాణంలో నా లాంటి డ్రీమ్స్, ఇష్టాలు కలిగిన ఆనంద్ రామ్‌ని కలుసుకున్నాను. స్నేహంతో మొదలైన బంధం ఇప్పుడు ప్రేమవరకు వచ్చింది. అలానే మేం 'ఐ లవ్ యూ' చెప్పుకొనే జోడీ కాదు' అని బ్రిగిడా సాగా రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement