సీఎం విజయ్‌లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ | Suriya Fans Association Reacts Actor Political Entry | Sakshi
Sakshi News home page

Suriya: రాజకీయాల్లోకి హీరో సూర్య? స్పష్టత వచ్చేసింది

Jun 30 2026 8:34 AM | Updated on Jun 30 2026 10:10 AM

Suriya Fans Association Reacts Actor Political Entry

నటుడు సూర్య స్టార్ హీరోగా రాణిస్తూ తన అగరం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈయన కూడా హీరో విజయ్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రిలా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలాన్నిచ్చేలా ఆదివారం చెన్నైలో జరిగిన సూర్య అఖిల ఇండియా అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహించిన రాష్ట్ర జిల్లా స్థాయి చర్చా సమావేశంలో ఆర్.వీరమణి.. నటుడు సూర్య రాజకీయ ప్రవేశం తథ్యం అని అన్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్')

సూర్య పొలిటికల్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీంతో అఖిల భారత సూర్య అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహకులు స్పందించారు. ఆర్.వీరమణి చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని, నటుడు సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.

సూర్య కెరీర్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ లేదు. గత నెలలో విడుదలైన 'వీరభద్రుడు' మూవీ తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ తమిళంలో మాత్రం అద్భుతమైన హిట్ అయింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆగస్టులో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో రాబోతున్న సూర్య.. మరోవైపు దర్శకుడు జీతూ మాధవన్ తీస్తున్న ఓ మూవీలో పోలీస్‌గా చేస్తున్నారు. నిన్ననే 'సలార్' నిర్మాతలతో కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్నప్పుడు ప్రాక్టికల్‌గా చూసుకున్న సూర్య.. రాజకీయాల్లోకి రావడం అనేది అసాధ్యం.

(ఇదీ చదవండి: అంత్యక్రియల ప్రదేశాన్ని సర్కస్‌లా చేసేశారు.. రాధిక అసహనం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement