మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. మరో టీజర్ వచ్చేసింది | Ashok Galla and Sri Gouri Priya Latest Movie VISA Teaser Out Now | Sakshi
Sakshi News home page

VISA Teaser: మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. ఆసక్తిగా టీజర్

Aug 14 2026 10:11 PM | Updated on Aug 14 2026 10:11 PM

Ashok Galla and Sri Gouri Priya Latest Movie VISA Teaser Out Now

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, శ్రీ గౌరీప్రియ జంటగా నటిస్తున్న అమెరికా బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీ చిత్రం 'VISA-వింటారా సరదాగా'. ఈ చిత్రానికి ఉద్భవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ మూవీ నుంచి మరో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్‌ చూస్తుంటే లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ కథ మొత్తం అమెరికాలోనే తెరకెక్కించారు. ముఖ్యంగా సత్య, రోహిణి కామెడీ టీజర్‌లో అలరిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement