అంత్యక్రియల ప్రదేశాన్ని సర్కస్‌లా చేసేశారు.. రాధిక అసహనం | Radikaa Angry Paparazzi Bhagyaraj Last Rites | Sakshi
Sakshi News home page

Radhika-Bhagyaraj: ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి.. రాధిక వీడియో వైరల్

Jun 29 2026 3:19 PM | Updated on Jun 29 2026 4:01 PM

Radikaa Angry Paparazzi Bhagyaraj Last Rites

రెండు రోజుల క్రితం తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూశారు. ఆయనకు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే అంత్యక్రియల్లో కొందరు కెమెరాలు పట్టుకుని భాగ్యరాజ్‌కు నివాళి అర్పించేందుకు వచ్చిన సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టారు. నటి రాధిక కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంది. ఆరోజే మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంది. ఆ వీడియో వైరల్ కాగా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తన అసహనాన్ని బయటపెట్టింది.

'అంత్యక్రియలనేవి దుఃఖంతో బాధపడుతున్న కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయం. హంగామా చేసేందుకు వ్యూస్ కోసం ప్రయత్నించే వేదిక కాదు. అంతిమ సంస్కారాల టైంలో మీడియాని నిషేధించాల్సిందే' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీన్ని రీట్వీట్ చేసిన రాధిక.. కచ్చితంగా నిషేధం విధించాలి అని రాసుకొచ్చింది. ఇక భాగ్యరాజ్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది.

50 ఏళ్ల స్నేహానికి వీడ్కోలు. ఎక్కడా ఆర్భాటం లేకుండా ప్రతి సందర్భంలోనూ నా కుటుంబానికి అండగా నిలిచారు. నిజంగా ఇది షాకింగ్ వీడ్కోలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు నివాళులు అర్పించాల్సిన ప్రదేశం ఓ సర్కస్ అయిపోయింది. ఇంత కఠినంగా మనం ఎప్పుడూ మారిపోయాం? ప్రభుత్వం, ఇండస్ట్రీ దీనిపై చర్చించాలి. అంత్యక్రియల టైంలో ప్రోటొకాల్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వాళ్లకు, ఆత్మకు గౌరవం ఇవ్వాలి' అని రాధిక తన ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement