సూర్య ముందు అద్భుతమైన అవకాశం | Vijay Exit from Cinema: Can Suriya Take the Top Superstar Spot in Kollywood? | Sakshi
Sakshi News home page

Suriya: సరిగ్గా ప్లాన్ చేసుకుంటే విజయ్ ప్లేస్ సూర్యదే

Aug 12 2026 2:08 PM | Updated on Aug 12 2026 2:43 PM

Is Suriya Replace In Vijay In Tamil Cinema Industry

హీరో విజయ్.. సీఎం విజయ్ అయిపోయారు. ఈయన చేసిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' గత నెలలోనే రిలీజైపోయింది. మరో వారం ఆగితే ఓటీటీలోకి కూడా వచ్చేయొచ్చు. సరే ఈ విషయం పక్కనబెడితే తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతానికైతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న హీరో విజయ్ మాత్రమే. ఇప్పుడు ఈయన యాక్టింగ్ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. మరి ఈ స్థానాన్ని భర్తీ చేసే హీరో ఎవరు? సూర్యకు ఎంత అవకాశముంది?

(ఇదీ చదవండి: మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్)

సూర్య స్టార్ హీరోనే కానీ గత కొన్నేళ్లలో సరైన సినిమాలు పడకపోయేసరికి క్రేజ్ తగ్గిన మాట వాస్తవం. కానీ ఈ ఏడాది 'కరుప్పు'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. 'వీరభద్రుడు' పేరిట ఇది తెలుగులోనూ రిలీజై మంచి వసూళ్లు అందుకుంది. రూ.350 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. సూర్య కెరీర్‌లోనే ఇదే అత్యధికం. ఇదొచ్చి మూడు నెలలు కూడా కాలేదు ఇంతలోనే 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో వచ్చేందుకు సూర్య సిద్ధమయ్యాడు. దీనిపై బజ్ బాగానే ఉంది. కాకపోతే కంటెంట్ క్లిక్ అవ్వాలి.

‍ట్రైలర్, పాటలు లాంటివి చూస్తుంటే ఇదో కుటుంబకథా చిత్రమని అర్థమవుతుంది. 'కరుప్పు' మాస్ కంటెంట్ కావడంతో చాలామంది ప్రేక్షకులకు కనెక్ట్ ‍అయింది. మరి 'విశ్వనాథ్'లో క్లాస్ టచ్ కనిపిస్తోంది. ఇది ఎంతమందికి కనెక్ట్ అవుతుందనేది చూడాలి? ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం సూర్య సక్సెస్ ట్రాక్‌లో పడ్డట్లే. ఇదే జోష్ కొనసాగిస్తూ వరసగా మంచి సినిమాలు చేస్తే మాత్రం విజయ్ వదిలేసిన స్థానాన్ని సూర్య అందుకోవచ్చు.

తమిళ ఇండస్ట్రీ వరకు చూసుకుంటే రజనీకాంత్, కమల్ హాసన్ వయసైపోయింది. అందుకు తగ్గట్లే సినిమాలు చేయడం తగ్గించేశారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చేశారు. అజిత్ అయితే యాక్టింగ్ కంటే రేసింగ్‌పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ధనుష్ ఏడాదికి రెండు మూడు మూవీస్ చేస్తున్నప్పటికీ ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రమే ఇతడికి ఉన్నారు. విక్రమ్, శింబు లాంటి వాళ్లు స్టార్‌డమ్ ఉన్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే చిత్రాలు చేయలేక బాగా వెనకబడిపోయారు. మిగిలిన వాళ్లలో శివకార్తికేయన్, కార్తీ, విశాల్ తదితరులని మిడ్ రేంజ్ కేటగిరీ అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సూర్య టాప్‌లోకి వెళ్లిపోవచ్చు. ఎటొచ్చి అందుకు తగ్గ డైరెక్టర్స్-సినిమాలు సెట్ కావాలంతే.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష.. అభిజిత్ పరువు తీసిన కంటెస్టెంట్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement