బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ సీజన్ 2’లో పాల్గొన్న ఆమె.. టామ్ క్రూజ్‌కు తనపై క్రష్ ఉందని, తనకు వీడియోలు కూడా పంపిస్తుంటారని తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
‘మీకు ఎప్పుడైనా ఎవరిపైనైనా క్రష్ కలిగిందా..?లేక మీపై ఎవరికైనా క్రష్ ఉందా..?’ అని కామెడీయన్ ఆదిత్య కులశ్రేష్ఠ(కుల్లు) మల్లికను అడిగారు. ‘అందరికీ నాపైనే క్రష్ కలుగుతుంది. ప్రస్తుతం టామ్ క్రూజ్‌కు కూడా నాపై క్రష్ ఉంది. మేమిద్దరం కలిసి పార్టీ చేసుకున్న సమయంలో తీసిన వీడియోలు క్రూజ్ నాకు పంపించినప్పుడు ఇతర కంటెస్టెంట్లకూ వాటిని చూపించేదానిని’ అని పేర్కొన్నారు.

పెళ్లిపై మల్లికా ఏమన్నారం..
మల్లికా గతంలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త సిరిల్ ఆక్సెన్‌ఫ్యాన్స్‌తో రిలేషన్‌లో ఉండేవారట. 2024 నుంచి తాను సింగిల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. పెళ్లికోసం మాట్లాడుతూ.. ‘పెళ్లికి అనుకూలంగా లేను. అలా అని దానికి వ్యతిరేకం కూడా కాదు. ఇద్దరు వ్యక్తులు ఏం కోరుకుంటున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది. అని తెలిపారు.
కాగా కరణ్ జోహర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ సీజన్ 2’ షో ఆగస్టు 13 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్వేతా తివారీ, మునావర్ ఫారూఖీ, క్రిస్టల్ డిసౌజా, రణ్‌వీర్ బ్రార్, ఇక్కా, పారుల్ గులాటి, అభిషేక్, తదితరులు ఇందులో పాల్గొన్నారు.


