ఓటీటీలోకి లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. అధికారిక ప్రకటన | Obsession OTT Release Date India Latest Update | Sakshi
Sakshi News home page

Obsession OTT: రూ.7 కోట్లతో తీస్తే రూ.3000 కోట్ల కలెక్షన్.. ఇప్పుడు ఓటీటీలో

Jun 29 2026 12:11 PM | Updated on Jun 29 2026 12:18 PM

Obsession OTT Release Date India Latest Update

రీసెంట్ టైంలో ప్రపంచం మొత్తం ఏదైనా సినిమా గురించి మాట్లాడుకున్నారంటే అది 'అబ్సెషన్' గురించే. కర్రీ బార్కర్ అనే ఓ యూట్యూబర్ దర్శకుడిగా మారి ఈ మూవీ తీశాడు. బడ్జెట్ కూడా రూ.7 కోట్లే. కానీ ఇప్పటివరకు రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదిరిపోయే రికార్డ్ సృష్టించింది. ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

గత నెల ప్రారంభంలో అమెరికాలో రిలీజ్ కాగా.. రెండు మూడు వారాల తర్వాత మన దేశంలోని థియేటర్లలో విడుదలైంది. భారతీయ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఆకట్టుకుంది. మంచి వసూళ్లు అందుకుంది. ఇప్పుడీ చిత్రం రేపటి(జూన్ 30) నుంచి ఆపిల్ టీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే రానుండగా.. త్వరలో తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ కూడా జోడించనున్నారు.

ఆపిల్ టీవీ ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మూవీలో మైకేల్ జాన్స్‌టన్, ఇండే నవరెట్టే హీరోహీరోయిన్లుగా నటించారు. అతిప్రేమ అనేది ఇద్దరు ప్రేమికుల జీవితాల్ని ఎలా నాశనం చేసిందనే పాయింట్‌తో 'అబ్సెషన్' తీశారు. అయితే కొందరు ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చలేదు కూడా.

'అబ్సెషన్' విషయానికొస్తే.. బేర్ (మైకేల్ జాన్స్‌టన్) కాలేజీ కుర్రాడు. ఓ మ్యూజిక్ షాపులో పనిచేస్తుంటాడు. ఇతడికి ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్లలో ఒకరైన నిక్కీని(ఇండే నవరెట్టే) ఇతడు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడిపోతుంటాడు. ఓ రోజు 'వన్ విష్' పేరుతో ఉన్న చిన్న వస్తువుని కొంటాడు. దాన్ని విరగ్గొట్టి నిక్కీ తనని చాలా ప్రేమించేయాలని బలంగా కోరుకుంటాడు. ఊహించని విధంగా ఆ కోరిక నిజమైపోతుంది. నిక్కీ, బేర్‌ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అప్పటివరకు అంతా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement