ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం నేరుగా వీటిలోనే రిలీజ్ చేస్తుంటారు. అలా ఓ క్రేజీ లవ్ స్టోరీ కామెడీ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి చిత్రం ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
ఎలన్ హీరో కమ్ దర్శకుడిగా చేసిన తమిళ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం'. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్. రాధిక కీలక పాత్ర చేసింది. దీనిని వచ్చే శుక్రవారం(ఆగస్టు 21) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
'ప్యార్ ప్రేమ కళ్యాణం' విషయానికొస్తే.. ఓ అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. సాధారణంగా వివాహం తర్వాత అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. కానీ ఇక్కడ అమ్మాయి, తన భర్తని ఇల్లరికం రమ్మని అడుగుతుంది. భార్యనే కదా అని అంగీకరిస్తాడు. అక్కడ నుంచి కష్టాలు మొదలు. మరి ఈ అబ్బాయి.. అత్తారింట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. సీరియస్ విషయమే అయినప్పటికీ కామెడీగా దీనిని చూపించబోతున్నారని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది.
(ఇదీ చదవండి: హీరో సూర్య ముందు అద్భుతమైన అవకాశం)


